Posani Krishnamurali : నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నిన్న ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు (rajampet jail) తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు ఛాతిలో నొప్పి వస్తుందని శనివారం చెప్పడంతో అతన్ని పోలీసులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో రిమాండ్ ఖైదీగా ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు పంపించారు. పోసానిని జైలుకు తరలించే ముందే డాక్టర్లు అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ చెప్పారు. ఇప్పుడు ఈ అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.