Ramba
ఎంటర్‌టైన్మెంట్

Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్

Senior Heroine: టాలీవుడ్‌లో ఒక్కప్పడు స్టార్ హీరోయిన్‌లలో రంభ ఒకరు. తనదైన నటనతో ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోను నటించి మెప్పించింది. గ్లామర్‌ పాత్రలు చేస్తూ.. మూడు దశాబ్దాల పాటు ఈ అందాల తార హవా నడిపించింది. అంతేకాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక పెళ్లి తరవాత రంభ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది. పిల్లల బాధ్యత తీసుకుంటూ మూవీస్‌కి గుడ్ బై చెప్పేసింది. అయితే ఇటీవల తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు వార్తలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మళ్ళీ ఈ తార రీ-ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే తెలుగులో ఈవీవీ సత్యనారాయణ దర్శకతంలో వచ్చిన `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంలో హీరోయిన్‌ పాత్ర పేరు రంభ. దీంతో అదే పేరు రియల్‌ స్క్రీన్‌ నేమ్‌గా డైరెక్టర్ పెట్టుకున్నారు. అలా విజయలక్ష్మి పేరు కాస్త రంభగా మారింది. ఇక రంభ 2010లో శ్రీలంకకు చెందిన బిజినెస్ మాన్ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి రంభ టొరంటోలో ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే భర్తతో విభేదాల కారణంగా తిరిగి ఇండియా వచ్చేసిందని వార్తలు వచ్చాయి. అప్పట్లో అయితే ఈ వార్తలపై స్పందించిన రంభ.. తమ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం నిజమేనని, అయితే ప్రస్తుతం కలిసిమెలసి హ్యాపీగా ఉంటున్నామని పేర్కొంది.

rambha

Also Read: తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 హోస్టుగా క్రేజీ హీరో?

అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రీ ఎంట్రీకి సిద్ధమని తెలిపింది. మళ్ళీ సినిమాల్లో అవకాశాలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని తెలిపింది. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సంసిద్దంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను’ అని చెప్పింది. మరోసారి యాక్టర్‌గా తాను ప్రూవ్ చేసుకునేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రేక్షకులకు మరో కొత్త కోణం చూపిస్తానని, వారికే నచ్చే పాత్రలు చేస్తానని చెప్పింది. ప్రేక్షకుల మన్ననలు పొందే.. మంచి పాత్రలు వస్తే చేస్తానని చెప్పింది. అయితే రంభ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచుస్తున్నారు. అప్పట్లో రమ్యకృష్ణ, సౌందర్య, మీనా, నగ్మా వంటి స్టార్ హీరోయిన్‌లతో పోటీ పడిన రంభ ఎలాంటి పాత్రలైనా ఇట్టే చేసేది. ఇక గ్లామర్ పాత్రలతో కుర్రకారుల మనుషులు దోచేసింది. మొత్తం 100పైగా నటించి ఆల్ ఇండస్ట్రీస్ షేక్ చేసింది. ఈ నేపథ్యంలోనే రంభ రీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్