anitha
ఆంధ్రప్రదేశ్

Home Minister Anitha: మా కూటమి బాగానే ఉంది… మీ పార్టీ లో అంతర్యుద్ధం రాకుండా చూసుకోండి!

Home Minister Anitha: కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) చేసిన వ్యాఖ్యలకు ఇవాళ హోంమంత్రి అనిత  కౌంటర్ ఇచ్చారు.  తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందంటూ వైసీపీ (YCP) నేత గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపడేశారు. తమ కూటమిలో ఎలాంటి అంతర్యుద్ధం లేదని, ముందు వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలన్నారు. అదేవిధంగా పోసాని అరెస్టు పై స్పందించిన ఆమె…ఇక నుంచి నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతామంటే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు. పోసాని పై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు.  తమ ప్రభుత్వం క్షక్షపూరిత రాజకీయాలు చేయడం లేదన్నారు. గతంలో మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై పోసాని చేసిన వ్యాఖ్యలు  క్షమించ రానివని కామెంట్ చేశారు.

కాగా, కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వైసీపీ  నేత గోరంట్ల మాధవ్  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూటమి నేతలు అనంతపురం ఎస్పీకి  ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా గోరంట్ల మాధవ్ వ్యవహరించారని ఆ ఫిర్యాదులో వివరించారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ