Ap Govt : ఏపీ ప్రభుత్వం రైతులకు (Farmers) గుడ్ న్యూస్ తెలిపింది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) పథకంపై చాలా అనుమానాలు ఉండేవి. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేయకపోవడంతో అసలు దాన్ని అమలు చేస్తారా లేదా అనే డౌట్ ఉండేది. అయితే తాజాగా దానికి కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఈ బడ్జెట్ లో దానికోసం బడ్జెట్ ను కూడా కేటాయించింది. రూ.6300 కోట్ల నిధులు కేటాయించింది. వచ్చే మే నెల నుంచి ఈ డబ్బులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్న రూ.6 వేలతో కలిపి ఎకరానికి రూ.20వేలు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వం రూ.14వేలు ఎకరానికి అందిస్తోంది. దీంతో పాటు తల్లికి వందనం పథకాన్ని కూడా ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం దీని కోసం రూ.9 వేల 400 కోట్లు అందించబోతోంది. ఈ పథకం కింద బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15వేలు పడుతాయి. ఈ పథకాన్ని కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభించబోతున్నారు.