Preity Zinta: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమంటే ఇదేరా’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఎంతో మంది మనస్సును దోచేసింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘రాజకుమారుడు’ మూవీతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఇక నటించలేదు. బాలీవుడ్‌కే పరిమితమై పోయింది. అక్కడే సెటిల్ అయిపోయింది. స్టార్ హీరోలందరితో వరుసగా నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక సోషల్ మీడియాలో సొట్ట బుగ్గల సుందరి యాక్టీవ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన అభిమానులతో వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ.. ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రీతి జింటా పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక ఫ్యాన్ ప్రశ్న వేశాడు. అయితే జవాన్ కుటుంబంలో పుట్టిన ప్రీతి జింటా తన దృష్టిలో కూడా జవానే అని, ప్రీతిని పొలిటికల్ ఎంట్రీ ఇద్దామని అనుకుంటున్నారా? అని ఆ అభిమాని అడిగాడు. దీనికి సమాధానమిస్తూ ..గతంలో కొన్ని పొలిటికల్ పార్టీలు టికెట్ లు ఇస్తామని చెప్పాయని అన్నారు.
Also Read: రైటర్‌గా మారిన స్టార్ హీరో!
తనకు పొలిటికల్ గా రాణించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీలో జాయిన్ కావాలని అడిగారని చెప్పింది. ఒక్క పార్టీ వ్యక్తులు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశారని తెలిపింది. సున్నితంగా వాటన్నంటిని తిరస్కరించానని పేర్కొంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి లేదని వెల్లడించింది. తనను ఒక సైనికరాలిగా పిలవడం తప్పుకాదని, తమ తండ్రి, సోదరుడు సైనికులు అని చెప్పుకొచ్చింది. తాము వెస్ట్, ఈస్ట్, నార్త్ ఇండియన్స్ కాదని, తాము భారతీయులం మాత్రమే అని పేర్కొంది. దేశభక్తి, జాతీయగర్వం తన బ్లెడ్‌లో ఉందని తెలిపింది. ఇటీవలకాలంలో సామాజిక మధ్యమాలు విషపూరితంగా మారాయని అభిప్రాయపడింది. ఎలాంటి వ్యాఖ్యలు చేసిన దానికి రాజకీయం ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను సున్నితమైన భావాలు కలిగిన సాధారణ మహిళనని, పొలిటికల్ వ్యక్తిరాలిని కాదని, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదని తెలిపింది.
Also Read: పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్
ఇక ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీ పార్టీకి అప్పగించినందుకు న్యూఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకులో ప్రీతి తీసుకున్న రూ.18 కోట్ల రుణం మాఫీ అయ్యిందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేయడంతో మండిపడింది. ఆ బ్యాంకును క్లోజ్ చేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్లను స్వయంగా తానే నిర్వహించుకుంటానని, ఇతరులకు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్స్ లో ఒకటైన పంజాబ్ కింగ్స్ కి సహ యజమానిగా ప్రీతి జింటా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.