Posani Krishna Murali
ఎంటర్‌టైన్మెంట్

Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్‌

Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అయితే పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇక విచారించిన కోర్టు.. బెయిల్‌‌కు నిరాకరించింది. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. దీంతో పోసానిని రాజంపేట జైలుకు తరలించారు.

ఇక వైసీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వైసీపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన వారిపై విరుచుకుపడేవాడు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లపై చాలా సార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే జనసేన నాయకుడు జోగినేని మణి పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు పోసానిపై మొత్తం 11 కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు  బీఎన్ఎస్ 196,353 (2),111 రెడ్ విత్ 3 (3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పోసాని వివాసానికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: రైటర్‌గా మారిన స్టార్ హీరో!

ఇక బుధవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసుల‌తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. మీరెవరు నన్ను తీసుకెళ్తున్నారు అంటూ ప్రశ్నించాడు. తనకు హెల్త్ సరిగ్గా లేదని ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని చెప్పిన పోలీసులు వినలేదు. నోటీసులు ఇవ్వండి.. ఆరోగ్యం కుదుట‌ప‌డ్డాక వచ్చి పోలీసులు ముందు హాజరవుతానని చెప్పాడు. అయినా కూడా పోలీసులు వినిపించుకోకుండా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్’కు తరలించారు. అటు పోసాని అరెస్ట్‌పై భార్య కుసుమ లత స్పందిస్తూ.. ప్రస్తుతం పోసాని హెల్త్ కండిషన్ బాగాలేదని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడని తెలిపింది. పోలీసులు సడెన్’గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి చేతికి నోటీసులు ఇచ్చి పోసానిని తీసుకెళ్లారని చెప్పింది. 66 ఏళ్ల వయసులో ఉన్న పోసాని సరిగ్గా కూర్చోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?