Posani Krishnamurali : సినీ నటుడు, మాజీ వైసీపీ (Ycp) నేత పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన్ను అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ పోసానిని ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు దాదాపు 4 గంటలు విచారించారు. చాలా ప్రశ్నలు సంధించినా..పోసాని మాత్రం పెద్దగా సమాధానం చెప్పట్లేదని పోలీసులు చెబుతున్నారు. పోసాని సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారని పోలీసులు అంటున్నారు.
పోసాని స్పష్టమైన సమాధానాలు చెప్పకపోవడంతో విచారణ ముందుకు సాగట్లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా సీరియస్ గానే విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పోసానిని సహకరించాలని కోరినా.. సరైన విధంగా స్పందించకపోవడంపై పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక న్యాయ నిపుణులు సలహాలు తీసుకునేందుకు లాయర్లను కూడా ఎస్పీ పిలిపించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తరఫు లాయర్లు, కోర్టు పీపీ కూడా వచ్చారు. వారితో చర్చించిన తర్వాత మరోసారి పోసానిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.