Vllabhaneni Vamshi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. పోలీసులు వంశీని మూడు రోజుల పాట కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. పటమట పోలీసులు ఆయన్ను మూడు రోజుల పాటు విచారించారు. విచారణ ముగియడంతో ఆయన్ను జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వంశీతో పాటు శివరామకృష్ణ, లక్ష్మీపతిలను కూడా పోలీసులు ప్రశ్నించారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా తనకు తెలియదు అని వంశీ పదే పదే చెప్పినట్టు తెలుస్తోంది. సరైన సమాధానాలు రాకపోవడంతో మరోసారి కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు వైసీపీ (ycp) పార్టీ ఇదే కేసుపై ట్రూత్ బాంబ్ పేరుతో సంచలన వీడియోలను కూడా రిలీజ్ చేస్తోంది. వంశీకి అటు కోర్టుల్లో కూడా వరుస షాకులు తగులుతున్నాయి. ముందస్తు బెయిల్ రద్దు కావడమే కాకుండా ఇతర పిటిషన్లను కూడా కోర్టు కొట్టేసింది.