Aadhi Pinisetty: ఆది పినిశెట్టి.. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్‌లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. మలుపు, సరైనోడు, నిన్ను కోరి, అజ్ఞాతవాసి, రంగస్థలం, యూ టర్న్ వంటి తెలుగు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్‌లో నటించిన ఆయన హీరో పాత్రలు కూడా చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఆది పినిశెట్టి సినిమా వస్తుందంటే.. ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఆది పినిశెట్టి నటించిన చిత్రం ‘శబ్దం’. ఈనెల 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది పినిశెట్టి తన పర్సనల్ విషయాలతో పాటు ‘శబ్దం’ మూవీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు.
స్క్రీన్ పై ఇదివరకు ఎప్పుడు చూడని కొత్త ప్రపంచాన్ని ఈ మూవీలో చూడపోతున్నారని తెలిపారు. ఇదొక హారర్ మూవీ అని.. ఇప్పుడు వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఒక పవర్ ఫుల్ స్టోరీని ఎంచుకున్నామని తెలిపారు. ఎమోషనల్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ మూవీలో ఒక ఇన్వెస్టిగేటర్ పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. అదృశ్య శక్తులతో కూడిన ఈ స్టోరీ అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు. తెలుగులో ‘శబ్దం’ని ఎన్.సినిమాస్, మైత్రీ సంస్థలు రిలీజ్ చేస్తుండడం హ్యాపీగా ఉందని తెలిపారు.
తన సినీ ట్రావెల్ హ్యాపీగా కొనసాగుతోందని తెలిపారు. ఒక నటుడిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు వెళ్తునానని చెప్పాడు. ఇలా వైవిధ్యమైన పాత్రలు చేయడం వల్ల నటుడిగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. అయితే తన సినిమాల విజయాల స్థాయి పెరగాలని కోరుకున్నారు. ఈ విషయంలో కొద్దీగా అసంతృప్తిగా ఉన్నానని తెలిపారు. అయినా కూడా ఓ యాక్టర్‌గా ఆసక్తిని పెంచే రోల్స్ చేస్తూ, బిజినెస్ విలువల్ని పెంచే మూవీస్ ఎంచుకుంటున్నానని తెలిపారు. అయితే గత రెండేళ్ల కాలంలో తన సినిమాలు రిలీజ్ కాలేదని, అయితే ఎన్నో సినిమాల్లో నటిస్తూనే ఉన్నానని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు ఐదు సినిమాలు విడుదల కానున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళంలో తన మూవీస్ రిలీజ్ కానున్నట్టు వెల్లడించారు.
Also Read : ఛీఛీ.. పుట్టబోయే పిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారు: ప్రియమణి
మరోవైపు తన భార్యతో ఆది పినిశెట్టి విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న వార్తలపై స్పందించారు. అయితే 2022లో హీరోయిన్ నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ‘మలుపు’ చిత్రంలో నటించిన ఈ జంట.. అప్పటి నుంచి ఇద్దరు మధ్య స్నేహం ఏర్పడింది. ఇక స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలా ఇద్దరూ ఎడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా వస్తున్న విడాకుల వార్తలపై ఆది పినిశెట్టి మండిపడ్డారు. తాము హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తుంటే.. కొందరు డైవర్స్ తీసుకుంటున్నామని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం కొన్ని యూట్యూబ్ చానెల్స్.. ఈ దారి ఎంచుకున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లను పట్టించుకోకపోవడమే మంచిదని వదిలేశానని, ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు.