Phone Tapping | ట్యాపింగ్ వేటు, తిరపతన్న, భుజంగరావు సస్పెండ్
Phone Tapping Case Regitar Under Indian Telegraph Act Case
Political News

Phone Tapping: ట్యాపింగ్ వేటు, తిరపతన్న, భుజంగరావు సస్పెండ్

– తిరపతన్న, భుజంగరావు సస్పెండ్
– వాట్సప్ చాట్‌ల పరిశీలన
– మరో ఇద్దరు సీఐల విచారణ షురూ
– ఖాకీల తర్వాత నేతలే టార్గెట్
– రాధాకిషన్ రావు కస్టడీకి సోమవారం పిటిషన్
– నెక్స్ట్ బయటకొచ్చే పేరు ఎవరిది?

Phone Tapping Case Regitar Under Indian Telegraph Act Case: తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుల మీద పోలీసు శాఖ చర్యలకు దిగింది. ఈ క్రమంలో శనివారం అరెస్టై విచారణను ఎదుర్కొంటున్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఇద్దరినీ సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లుగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కీలకమైన ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందం ఈ వ్యవహారంలో వీరితో చేతులు కలిపిన మరికొంత మంది అధికారుల నాటి కార్యకలాపాల మీద దృష్టి సారించింది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా భుజంగరావు, తిరపతన్నలను పోలీసులు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించిన వీరిద్దరి మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వాట్సప్ చాటింగ్‌ని సైతం పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో వీరి ఆదేశాలను అమలు చేసిన మరో ఇద్దరు సీఐలను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినీ విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాధాకిషన్ రావును వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని సోమవారం రోజున నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల్లో పంచేందుకు డబ్బు మూటలను ఏకంగా టాస్క్‌ఫోర్స్ వాహనాల్లోనే తరలించినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించిన సంగతి తెలిసిందే.

Read Also: పోటీ నుంచి నామా తప్పుకుంటారా..?

ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా ఉన్న ఖాకీల మీద దృష్టి సారించిన పోలీసు శాఖ, ఇకనుంచి ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న రాజకీయ నాయకుల మీద దృష్టి సారించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు సీనియర్ నేతలతో బాటు ఈ వ్యవహారంలో అమాయకులను బెదిరించి, అక్రమార్జనకు పాల్పడిన చోటా నేతల జాబితానూ రూపొందించే పనిలో పోలీసు శాఖ ఉన్నట్లు సమాచారం.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..