Posani Krishnamurali
ఎంటర్‌టైన్మెంట్

Posani Arrest : పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై నటుడు హాట్ కామెంట్స్

Posani Arrest : ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పోసాని వివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై విరుచుకుపడేవాడు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్‌లపై చాలా సార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు.

అయితే ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశాడంటూ.. తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులపై కించపరిచేలా కామెంట్స్ చేశాడని అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన కేసుల నేపథ్యంలో ఏపీ నుంచి పోలీసులు పోసాని ఇంటికి ఒక ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుల్స్ వచ్చి అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

మరోవైపు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై ప్రముఖ నటుడు పృథ్వీరాజ్(Prithviraj) స్పందించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, అడ్డొగోలిగా మాట్లాడితే ఇదే పరిస్థితులు వస్తాయని అన్నారు. మాటలు మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడని తెలిపారు. నోటిదూలకు తగిన శాస్తి తప్పదని పేర్కొన్నారు. నిజం తెలిసి ఆగిపోయినవాడే మహాపురుషుడు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు పృథ్వీరాజ్‌కి అనుకూలంగా రిప్లై ఇస్తుండగా.. మరికొందరి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.

Posani Arrest

Also Read: వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శృతి హాసన్ హాలీవుడ్ సినిమా!

అటు పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై భార్య కుసుమ లత స్పందించారు. ప్రస్తుతం పోసాని హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పారు. గురువారం ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి ఉందని అన్నారు. సడన్ గా పోలీసులు వచ్చి చేతికి నోటీసులు ఇచ్చి పోసానిని తీసుకెళ్లారని, ఎక్కడికి తీసుకెళ్తున్నామని కూడా చెప్పలేదని పేర్కొన్నారు. నేడు నోటీసులు తీసుకుని వస్తామని చెప్పిన వినలేదని పేర్కొన్నారు. 66 ఏళ్ల వయసులో ఉన్న ఆయన సరిగ్గా కూర్చోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. పోలీసులు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే