Euphoria Making Video: టాలీవుడ్‌లో సుప్రసిద్ధ దర్శకుడు గుణ శేఖర్ (Gunasekhar) కు అర్జెంట్‌గా హిట్ కావాలి. ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాలు చాలా తక్కువే అయినా, ప్రతి సినిమాకు హిస్టారికల్ టచ్ ఇస్తూ, వైవిధ్యతను చాటుకుంటున్నాడు. కానీ రిజల్ట్ మాత్రం ఆయనకు అనుకూలంగా రావడం లేదు. భారీ బడ్జెట్‌తో సమంత (Samantha)ని ప్రధాన పాత్రలో పెట్టి చేసిన ‘శాకుంతలం’ సినిమా ఆయనకు మాములుగా ఝలక్ ఇవ్వలేదు. ఆ సినిమాకు నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించడంతో, భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ‘శాకుంతలం’ ఇచ్చిన షాక్‌తో, ఇక ‘భారీ’ ప్రయత్నాలు మానేసి చిన్నగా ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న చిత్రం ‘యుఫోరియా’. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?
మహా శివరాత్రి స్పెషల్‌గా మేకింగ్ వీడియో
గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నూతన నటీనటులతో పాటు, భూమిక వంటి సీనియర్ యాక్టర్స్ కాంబోలో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా, ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘యుఫోరియా’ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపిన టీమ్, మహా శివరాత్రి (Maha Shivaratri) స్పెషల్‌గా ఓ మేకింగ్ వీడియోను వదిలి, సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే, గుణ శేఖర్ ఎంతో కసిగా ఈ సినిమా రూపొందిస్తున్నాడనే విషయం అర్థమవుతోంది.

యుఫోరియా టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ తెలియజేసేలా ఇప్పటికే వచ్చిన వీడియో అందరినీ ఆకట్టుకోగా, ఈ మేకింగ్ వీడియో మరింతగా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఈ చిత్రంతో విఘ్నేశ్ గవిరెడ్డి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుండగా, సీనియర్ నటి భూమిక ఇందులో ముఖ్య పాత్రలో కనిపించనుంది. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. దర్శకుడిగా గుణ శేఖర్ ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. భారీ సెట్స్, గ్రాఫిక్స్ వంటి వాటికి పెట్టింది పేరు గుణ శేఖర్ చిత్రాలు. కానీ, ఈసారి ఆయన చాలా సింపుల్‌గా, ఎటువంటి భారీతనం లేకుండా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన అభిమానులు కూడా ఈ సినిమాతో గుణ శేఖర్ మళ్లీ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు.