Radisson Drugs Case Files On Celebrities
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana State : రాడిసన్ కేసులో తొలి క్రొమటోగ్రఫీ పరీక్ష ఇదే

– నిందితులకు క్రొమటోగ్రఫీ పరీక్షలు
– 3 నెలల క్రితం డ్రగ్స్ తీసుకున్నా తెలిపే పరీక్ష
– హైకోర్టు అనుమతికై ఎదురుచూస్తున్న పోలీసులు
– తెలంగాణలో తొలి క్రొమటోగ్రఫీ పరీక్ష ఇదే


Radisson Drugs Case Files On Celebrities In Telangana: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నిందితులకు క్రొమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించి, వారి శరీరంలోని డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు రంగం సిద్ధం చేశారు. నిందితులకు ఈ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు హైకోర్టు అనుమతి కోరుతూ ఒక పిటిషన్‌నూ దాఖలు చేశారు. ఒకవేళ హైకోర్టు వీరి పిటిషన్‌ను ఆమోదిస్తే, తెలంగాణలో డ్రగ్స్ కేసులో చేపట్టిన తొలి క్రొమటోగ్రఫీ పరీక్ష ఇదే కానుంది. ఈ పరీక్షల కోసం పోలీసులు గతంలో కూకట్‌పల్లి కోర్టు అనుమతిని కోరగా, న్యాయస్థానం ఇందుకు నిరాకరించింది. అయితే, ఈ హైప్రొఫైల్ కేసులో నిందితులు తప్పించుకోరాదనే ఉద్దేశంతో సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని క్రొమటోగ్రఫీ డ్రగ్‌ టెస్ట్‌ చేయాలని నిర్ణయించి హైకోర్టును ఆశ్రయించారు.

డ్రగ్స్ కేసుల్లో సాధారణంగా పోలీసులు డ్రగ్ టెస్ట్ కిట్ సాయంతో ప్రాథమిక పరీక్ష చేస్తారు. ఒకవేళ అందులో పాజిటివ్ అని వస్తే అనుమానితుల మూత్ర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు కోరతారు. దీనినే కోర్టు ముందు పెట్టటం జరుగుతుంటుంది. అయితే, డ్రగ్స్ తీసుకున్న మూడు రోజుల(72 గంటలు) వ్యవధిలో ఈ మూత్ర నమూనా పరీక్ష చేస్తేనే ఖచ్చితమైన ఫలితాలొస్తాయి. ఫిబ్రవరి 24న రాడిసన్ హోటల్‌లో పార్టీ జరగగా, దానికి హాజరైన గజ్జల వివేకానంద్‌తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. అయితే, పార్టీకి హాజరైన మిగిలిన వారు పారిపోవటంతో వారం దాకా పోలీసులు వారికి పరీక్షలు చేయలేకపోయారు. దీంతో పోలీసులు మూడు నెలల వరకు శరీరంలో డ్రగ్ ఆనవాళ్లను గుర్తించి, నిర్ధారించే క్రొమటోగ్రఫీ పరీక్ష చేయాలనే నిర్ణయానికొచ్చారు.


Read Also:దర్జాగా దగా..! రైతుల పాలిట ట్రబుల్ మేకర్

కొకైన్‌ లాంటి డ్రగ్స్ తీసుకుంటే దాని ఆనవాళ్లు రక్తం, మూత్రం, గోళ్లు, వెంట్రుకల్లో నెలరోజుల పాటు మిగిలిపోతాయి. నెల దాటితే మాత్రం ఆ ఆనవాళ్లను గుర్తించటం కష్టమే. ముఖ్యంగా కొకైన్ ఆనవాళ్లు రక్తంలో 2 రోజులు, మూత్రంలో 3, ఉమ్మిలో 2 నుంచి 4 రోజులు, గోళ్లు, వెంట్రుకల్లో 3 నుంచి 4 వారాల పాటు మాత్రమే ఉంటాయి. అందులో ఈ కేసులో నిందితులు కావాలనే ఆలస్యంగా పోలీసుల ముందుకు వచ్చారనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఫిబ్రవరి 24న హోటల్ రాడిసన్‌లో డ్రగ్స్ పార్టీ గురించి తెలుసుకున్న పోలీసులు, హోటల్‌లోని 1200,1204 గదులను తనిఖీ చేయగా, మూడు ఖాళీ ప్లాస్టిక్ పేపర్లతో బాటు ఒక వైట్ పేపర్ రోల్ లభించింది. వాటిమీది తెల్లని పొడిని కొకైన్‌గా నిర్ధారించిన పోలీసులు తొలుత ప్రధాన నిందితుడు వివేకానంద్‌తో బాటు మరో ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా, వీరి ముగ్గురికీ పాజిటివ్ వచ్చింది. సరిగ్గా వారానికి (మార్చి 1) ఈ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, మరో రెండు రోజులకు లిషి, సందీప్‌.. తదితర నిందితులూ హాజరై నమూనాలను ఇచ్చారు. అయితే.. వీరి నమూనాలను విశ్లేషించగా, నెగిటివ్ వచ్చింది. వెంటనే పరీక్షిస్తే పరీక్షలో దొరికిపోతామనే ఉద్దేశంతో నిందితులు కావాలనే లేట్‌గా తమ ముందుకు వచ్చారని భావించిన పోలీసులు క్రొమటోగ్రఫీ పరీక్షకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ