Tuesday, December 3, 2024

Exclusive

Harish Rao Scam : దర్జాగా దగా..! రైతుల పాలిట ట్రబుల్ మేకర్

– సిద్దిపేటలో హరీష్ రావు ఘరానా స్కాం
– రైతుల పాలిట ట్రబుల్‌ మేకర్‌గా మారిన ట్రబుల్‌ షూటర్
– రంగనాయక సాగర్ పేరుతో రైతుల భూములు హాంఫట్
– అధికార బలంతో అన్నదాతల పొలాలను ఫాంహౌజ్‌గా మార్చుకున్న వైనం
– రిజర్వాయర్ డిజైన్‌లోనూ హరీష్‌ రావు మాయాజాలం
– లీగల్‌గా దొరకకుండా జాగ్రత్తలు
– రైతుల నుంచి లాక్కున్న భూమిని సుడాకు అప్పగించడం వెనుక మతలబేంటి?
– ‘బిగ్ టీవీ-‘స్వేచ్ఛ’ సెన్సేషన్

Harish Rao Scams : అధికారం మనదే.. అధికారులూ మనోళ్లే.. ఏం చేసినా అడేగేదెవరు..? ఈ లెక్కనే ఆలోచించి ఉంటారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగనాయక సాగర్ మాటున జరిగిన భూ దందాను చూసిన ఎవరైనా ఇదే మాట అంటారు. అమాయక రైతుల్ని నమ్మించి, సరైన పరిహారం ఇవ్వకుండా సాగిన ఈ దందాను ‘బిగ్ టీవీ’-‘స్వేచ్ఛ’ ఎక్స్ క్లూజివ్‌గా బయటపెట్టాయి. కావాలని ప్రాజెక్టు కట్టను వంపు తిప్పడం, సుడా ట్రీ పార్క్‌, కుల సంఘాలకు భూముల కేటాయింపు ఇలా అన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొచ్చాయి.

రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ స్వరూపం

సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో రంగనాయక సాగర్ నిర్మాణం జరిగింది. దీనికోసం పెద్దకోడూరు, సందులాపూర్, లింగారెడ్డిపల్లి, రామంచ గ్రామాలకు చెందిన భూములను సేకరించింది ప్రభుత్వం. ఈ భూసేకరణ కోసం 22 వందల ఎకరాలు అవసరమని అంచనా వేశారు. అయితే, 16 వందల ఎకరాల వరకు భూమిని సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11లో భాగంగా 3 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. 2020 ఏప్రిల్‌ 24న అప్పటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దీనిని ప్రారంభించారు. 8.65 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రిజర్వాయర్ బండ్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని 1.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. అయితే, భూ సేకరణ విషయంలో కొందరు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది.

అలైన్‌మెంట్ మార్చేసిన హరీష్ రావు

మామ కేసీఆర్‌కు ఫాంహౌస్ ఉన్నప్పుడు తనకెందుకు ఉండకూడదని అనుకున్నారో ఏమో హరీష్ రావు కూడా ఓ ఫాంహౌస్ కట్టుకున్నారు. దీనికోసం ఏకంగా రంగనాయకసాగర్ డిజైన్‌ను మార్చేశారు. ఎక్కడైనా ప్రాజెక్ట్ అంటే కట్ట స్ట్రయిట్‌ ఉంటుంది. కానీ, హరీష్ రావు పుణ్యమా అని రంగనాయక సాగర్ మాత్రం ఒంపు తిరిగింది. అదికూడా మామూలు ఒంపు కాదు. ఈ డిజైన్ మార్చడం వెనుక పెద్ద ప్లానే ఉంది. భవిష్యత్తులో తన ఫాంహౌజ్‌కు ఏ ట్రబుల్‌ రాకుండా ఉండేందుకు సుడా నర్సరీని, ట్రీ పార్క్‌ను ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయించారు. అంతేనా, ఫాంహౌజ్‌లో పెట్టిన మొక్కలు కూడా సర్కార్ వారి ఖర్చే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్క హరీష్‌రావు ఫాంహౌజ్‌ ఉన్న దగ్గర మాత్రమే ఎందుకు ఇలా డిజైన్‌ను మార్చారనేది అనేక డౌట్స్‌కు కారణమవుతోంది.రంగనాయక సాగర్ ప్రాజెక్టు గట్లు ఎక్కడివరకూ వస్తాయో హరీష్ రావుకు మాత్రమే తెలుసు. అందుకే, రైతులకు మాయ మాటలు చెప్పి భూసేకరణ పేరుతో భూములు లాగేసుకున్నారు. అవే అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ రావుకు, కొంతమంది బీఆర్‌ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నది అక్కడి రైతులు ఆవేదన. హరీష్ రావు ఫాంహౌజ్ ఉన్న ప్రాంతం సిద్ధిపేట పక్కనే ఉన్న రామంచ. ఆ ఊల్లో హరీష్ రావు పేరిట ఉన్న భూముల రికార్డులను ‘బిగ్‌ టీవీ’-‘స్వేచ్ఛ’ సేకరించాయి. సర్వే నెంబర్లు 402, 405, 406, 464లో హరీష్ రావుకు మొత్తం 13 ఎకరాల 12 గుంటల భూమి ఉంది. 2018 ఆగస్టు 13 వరకు ఒక్క గుంట భూమి కూడా హరీష్‌ రావుకు లేదు. ఆ తర్వాతే ఆయన పేరిట భూములు వచ్చాయి.

Read Also: ట్యాపింగ్ ఎఫెక్ట్ ఖాకీల అరెస్ట్..!!

రంగనాయక సాగర్‌ కోసమంటూ ఒక గుంట మాత్రమే ఉన్న రైతు నుంచి కూడా భూమి లాక్కున్న అధికారులు, హరీష్ రావు పేరిట మారే భూములను మాత్రం ముట్టుకోలేదు. ధరణిలో కొందరు భూ యజమానుల పేర్లు మార్చి వాటిని హరీష్ రావు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రాజెక్టులో మునగాల్సిన భూమి దారి మళ్లి హరీష్ రావు ఫాంహౌస్‌లో కలిసిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, ఒక ఎకరా 36 గుంటల భూమిని 2019 ఫిబ్రవరి 11న హరీష్ రావు కొన్నట్లు ఆయన ఎలక్షన్ అఫిడవిట్‌లో ఉంది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవు. మరి, ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందనేది పెద్ద ప్రశ్న.రైతుల భూముల కోసం హరీష్ రావు వేసిన ప్లాన్ మామూలుది కాదు. ఎవరికీ దొరకకుండా ఉండడానికి, తనకు కావల్సిన భూమిని భూసేకరణ నుంచి తప్పించి చేతులు మార్చి మరీ తన పేరిట మార్చుకున్నారు. లీగల్‌గా దొరకకుండా రైతుల నుంచి నేరుగా కొన్నా అని చెప్పుకోవడానికే ఇలా చేతులు మార్చారన్న ఆరోపణలు హరీష్ రావుపై ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న మరికొంత భూమి ఎవరి నుంచి ఎవరి ద్వారా ఆయన పేరు మీదకి వచ్చిందనే రికార్డులు ఎక్కడా దొరకడం లేదు. రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు డిజైన్ తనకు కావల్సినట్లు మార్చుకున్న హరీష్ రావు, ప్రాజెక్టులోకి వచ్చేలా తన ఫాంహౌజ్‌ను కట్టుకునేందుకు రైతుల భూములను లాక్కున్నారు. అందుకే, డిజైన్ మారింది. చివరకు రైతుల పొట్టగొట్టి హరీష్ రావు కట్టుకున్న ఫాంహౌజ్ మాత్రమే మిగిలింది.

రంగనాయక సాగర్ ఒడ్డున హరీష్ రావు ఫాంహౌజ్‌కు ముందు సుడా నర్సరీ ఉంది. పక్కనే చెట్లు ఉన్న ప్రాంతం సుడా ట్రీ పార్క్‌. రంగనాయక సాగర్‌ ఒడ్డునే సుడా ఆధ్వర్యంలో ఓ రిసార్ట్‌‌ను కూడా కడుతున్నారు. రిజర్వాయర్ కోసం సేకరించిన భూములు సుడా చేతుల్లోకి ఎలా వెళ్లాయనేది ఆరా తీస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూమిలో అంగుళం కూడా సుడాకు ఇవ్వలేదని కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి ఒక్క అంగుళం కూడా సుడాకు ఇవ్వకపోతే ఆ ప్రాంతంలో పార్కులు ఎలా వచ్చాయి? నర్సరీలు ఎలా వెలిశాయి? రిసార్టులు ఎలా వస్తున్నాయి? హరీష్ రావు వీటికి సమాధానం చెప్పగలరా? ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే, రంగనాయక సాగర్‌ కోసం ఓ రైతు నుంచి తీసుకున్న 21 గుంటల భూమిలో 19 గుంటల భూమిని ఓ కుల సంఘానికి అనధికారికంగా ఇచ్చేశారు. ప్రాజెక్టుకు అవసరం లేనప్పుడు తన భూమి తనకు ఇచ్చేయమని బాధిత రైతు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. మిగిలిన 2 గుంటల భూమిలోనూ అతన్ని సాగు చేసుకోనివ్వడం లేదు.

Read Also: రోగుల సొమ్ము కాజేశారు..

ఈ మొత్తం వ్యవహారంలో ఎటు నుంచి ఎటు చూసినా అన్ని వేళ్లూ హరీష్ రావు వైపే చూపిస్తున్నాయి. భూములు సుడా చేతుల్లోకి, ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక హరీష్ రావు వ్యూహం ఉందన్నదే అక్కడి రైతుల ఆరోపణ. బీఆర్‌ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా ఎదిగిన వ్యక్తి, తమ పాలిట ట్రబుల్ మేకర్ అయ్యాడంటున్నారు రైతులు. ప్రాజెక్టుకు అవసరం లేని భూములను సేకరించడం వెనుక హరీష్ రావు వ్యూహం ఉంది. ట్రీపార్క్‌కు, రిసార్ట్‌కు మధ్య ఉన్న భూమిలో ఎక్కువ భాగం ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉంది. అక్కడ వీటిని ఏర్పాటు చేయడం ద్వారా తన ల్యాండ్ వాల్యూ పెంచుకోవాలన్నది ఆయన కుట్రగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా ఇన్‌సైడర్ ట్రేడింగ్. ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ పక్కాగా తెలిసిన హరీష్ రావు, తనకు నచ్చిన ప్లేస్‌లో పొలాలను లాక్కుని, దానికి తగ్గట్లుగా డిజైన్ మార్చుకున్నారు. తనకు కావల్సినట్లుగా పార్కులు కూడా కట్టేసుకున్నారు. అందుకే, రంగనాయక సాగర్ భూసేకరణ పైనా, ఆ తర్వాత జరిగిన భూముల క్రయవిక్రయాలపైనా పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటున్నారు రామంచ రైతులు. ఇంతకాలం హరీష్ రావు అధికార బలాన్ని చూసి భయపడి సైలెంట్‌గా ఉన్న వాళ్లంతా ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. పూర్తి స్థాయిలో పరిహారం అందని వాళ్లు 15 శాతం ఉంటారని, రిజర్వాయర్ కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...