cm-pm
తెలంగాణ

Cm meets Pm Modi: ప్రధానితో భేటీ అయిన రేవంత్… పలు అంశాలపై చర్చ

CM meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. దాదాపు ఆరు మాసాల తర్వాత ఇవాళే ప్రధానిని కలిసి రేవంత్… పలు అంశాల పై చర్చించారు. ఈ భేటీలో ప్రధానంగా నాగర్ కర్నూల్ లో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ (Slbc Tunnel tragedy) ప్రమాద ఘటనను గురించి ప్రధానికి సీఎం వివరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరినట్లు సమాచారం. అలాగే విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యలను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. ఆ అంశంపై కూడా సీఎం ప్రధానితో చర్చించనట్లు తెలుస్తోంది.

ప్రధానంగా పెండింగ్ లో ఉన్న అంశాల గురించి రేవంత్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే,మూసీ నది సుందరీకరణ నిధులు,వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, రీజనల్ రింగ్ రోడ్డు వంటి తదితర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం కోరారు.

ఈ భేటీకి సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా, మరికొంత మంది కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటి అవుతారని సమాచారం.

Also Read:

Ktr : దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు: కేటీఆర్

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!