Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకి ప్రస్తుతం పరిచయం అక్కరలేదు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy), ‘యానిమల్’ (Animal) అనే రెండు సినిమాలతో దాదాపు 50 సినిమాలకు వచ్చినంత నేమ్, ఫేమ్ ఈ దర్శకుడి సొంతం. అలాంటి దర్శకుడు హర్ట్ అయ్యాడు అంటే మాములు విషయమా? అసలు ఇంతకీ ఏ విషయంలో హర్టయ్యాడు? ఎందుకు హర్టయ్యాడు? అని అనుకుంటున్నారా? దీనికి పెద్ద కథే ఉంది. ఇది తెలియాలంటే, ‘యానిమల్’ సినిమా థియేటర్లలో ఆడుతున్న రోజులకి వెళ్లాల్సిందే. ‘యానిమల్’ సినిమా విడుదలైన తర్వాత, సినిమాపై మరీ ముఖ్యంగా దర్శకుడిపై ఎటువంటి విమర్శలు వచ్చాయో తెలియంది కాదు. అసలు ఇంత బోల్డ్ సినిమా ఎలా తీస్తారు? ఈ సినిమాను సెన్సార్ వారు ఎలా ఓకే చేశారు? అంటూ ఒకటే విమర్శలు. ఇక దర్శకుడిని అయితే, అసలు ఆడవాళ్లని అలా ఎలా చూపిస్తారు. బూతు సినిమాలు తీసే దర్శకుడు అంటూ కొందరు విమర్శకులు కూడా కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సందీప్ ఓ ‘లా’ పాయింట్‌తో అందరికీ మతిపోయేలా ఓ క్వశ్చన్ రైజ్ చేశాడు. అదేంటంటే..
Also Read- Rashmika Mandanna: రష్మికకు వింత అలవాటు.. అదేం పని?
దర్శకుడు మంచి వాడు కాదా!
‘‘నేను బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త దర్శకుడిని. ‘యానిమల్’ సినిమాను తీసింది నేనే. కానీ అందులో యాక్ట్ చేసింది మాత్రం బాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో. మరి విమర్శకులు నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు. హీరోని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. అంటే నా ఉద్దేశ్యం హీరోని అనాలి అని మాత్రం కాదు. మేమందరం చేసిన సినిమా అది. హీరో రణ్‌బీర్‌ని మాత్రం ఒక్క మాట అనలేదు. పైగా ఆయన బ్రిలియంట్ హీరో అంటూ ప్రశంసించారు. విమర్శకులు కూడా హీరో పేరు ఎక్కడా వాడలేదు. ఆయనని బ్రిలియంట్ హీరో అన్నందుకు నాకేం అసూయ, జలసీ ఏం లేదు. ఆయన నా హీరోనే. నేను చెప్పేది ఏమిటంటే, కేవలం నన్ను మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారు. హీరో మంచివాడు, దర్శకుడు మాత్రం మంచివాడు కాదు. ఇదేంటి? ఎందుకీ తేడా?’’ అని సందీప్ ప్రశ్నించాడు.
వారికి హీరో కావాలి!
ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఆయనే చెప్పాడు. ‘‘ఈ విషయంలో నన్ను విమర్శించిన వారిలో నిర్మాతలే ఎక్కువగా ఉన్నారు. నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ నిర్మాతలందరూ రణ్‌బీర్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అందుకే హీరోని ప్రశంసిస్తూ, నాపై మాత్రమే విమర్శలు గుప్పించారు. ఒక రచయిత లేదా దర్శకుడు చెప్పిన కథ నచ్చితేనే హీరో సినిమా చేస్తాడు. ‘యానిమల్’ కథ రణ్‌బీర్‌కి నచ్చింది కాబట్టే సినిమా చేశాడు. అది ఆ నిర్మాతలకి ఎందుకు తెలియడం లేదో నాకు అర్థం కావడం లేదు. నన్ను విమర్శించి, హీరోని ప్రశంసించిన వారంతా, ఆ హీరోతో సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. అందుకే హీరో పేరు ఎక్కడా వాడకుండా, దర్శకుడి పేరును మాత్రమే వాడుతున్నారు. ఇదే నన్ను హర్ట్ చేసింది’’ అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు.