Mad-Square
ఎంటర్‌టైన్మెంట్

MAD Square Teaser: నవ్వకుండా ఉండగలరేమో ట్రై చేయండి!

MAD Square Teaser: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ వంటి వారు నటించిన ‘మ్యాడ్’ సినిమా ఎటువంటి సక్సెస్‌ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పు సినిమా వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ కూడా సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి మేకర్స్ టీజర్ వదిలారు. ఈ టీజర్ నవ్వుల పువ్వులు పూయిస్తూ.. విడుదలైన నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఈ టీజర్ ఎలా ఉందంటే..

Also Read- Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?

ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని ఇవ్వనుందనేది టీజర్‌లోని ప్రతి షాట్‌తో స్పష్టం చేస్తుంది. ‘మ్యాడ్’తో ఎలా అయితే తనదైన శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో దర్శకుడు కళ్యాణ్ శంకర్ మెప్పించాడో, ఈ సీక్వెల్‌తోనూ మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ టీజర్ చూసి నవ్వకుండా ఉండగలరేమో ట్రై చేయండి అనేలా ఛాలెంజ్ విసురుతున్నాడు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ (లడ్డు)‌లు ఈ సీక్వెల్‌లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారనేది ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ టీజర్‌లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మొత్తంగా అయితే ‘మ్యాడ్’కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ రెడీ అవుతుందనే విషయాన్ని ఈ టీజర్‌తో హింట్ ఇచ్చేశారు మేకర్స్.

ఈ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం, శామ్‌దత్ సినిమాటోగ్రఫీ. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ హైలెట్‌గా ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్‌నెస్‌ను ఈ సీక్వెల్‌లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలుపుతోంది. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’.. ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఎలా ఉందంటే..

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?