KTR With Bag
Viral, తెలంగాణ

KTR: కేటీఆర్ దగ్గరున్న ‘లేడీ బ్యాగ్’ ఎవరిదబ్బా.. ఎక్కడో చూసినట్టే ఉందే!

KTR: అవును.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) దగ్గరనున్న లేడీ బ్యాగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద రచ్చే అవుతున్నది. ఎంతలా ఉంటే ఆయనదో చేయరానిది చేసేశారన్నట్లుగా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. కొందరు ఈ బ్యాగ్‌ను ఎక్కడో చూసినట్టుగానే ఉందే అని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో అబ్బే ఇంత చీప్ మెంటాలిటీ ఏంట్రా బాబూ? అంటూ మండిపడుతున్న వాళ్లూ ఉన్నారు. ఆ బ్యాగ్ గురించి ఎందుకింత చర్చ? అసలు ఈ ఫొటో ఎలా బయటికొచ్చింది? దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ వీరాభిమానులు ఏమనుకుంటున్నారు? ఇంతకీ ఈ ఫొటో ఒరిజనలా? లేకుంటే ఫేక్ ఆ..? బీఆర్ఎస్ శ్రేణుల కౌంటర్ ఎలా ఉంది? అనే విషయాలు చూసేద్దాం రండి..

Read Also- Opal Suchata: ప్రామిస్ ప్రభాస్ సినిమా చూస్తా.. మిస్ వరల్డ్ చెప్పిన మూవీ ఏంటో తెలుసా?

KTR Bag

ఇదీ అసలు సంగతి..?
కేటీఆర్ అమెరికా, లండన్ పర్యటలో బిజిబిజీగా గడుపుతున్నారు. రెండ్రోజుల అమెరికా టూర్ (KTR America Tour) ముగించుకున్న ఆయన ప్రస్తుతం డల్లాస్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సంబురంగా జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమాలకు డాక్టర్‌ పెప్పర్‌ ఎరినా ప్రాంగణం వేదిక అయ్యింది. ఆ ప్రాంతం అంతా గులాబీమయమైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనబోతున్నారు. అయితే ఈ టూర్‌లో భాగంగా కోవెంట్రీ నుంచి లండన్‌ వరకూ రైలులో ప్రయాణించారు. పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవం తర్వాత మోటర్‌వే ట్రాఫిక్‌ను నివారించడానికి రైలులో వెళ్లడం మంచి ఆలోచన అని, ప్రయాణం తక్కువైనప్పటికీ బాగుందని ఎక్స్ వేదికగా కేటీఆర్ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. అయితే.. ఇందులో ఒక ఫొటోను పట్టుకున్న తెలంగాణ పీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ మహేష్ బాబు ముదిరాజ్ ‘జస్ట్ ఆస్కింగ్.. ఈ బ్యాగ్ ఎవరిది అన్నా? ఎక్కడో చూసినట్టు ఉందే!?’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది.

KTR Original

ఆపండ్రా.. బాబోయ్!
మహేష్ చేసిన ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు చిత్ర విచిత్రాలుగా స్పందిస్తున్నారు. ‘ఎప్పుడు చూసినా బ్యాగుల మీదేనా? కన్ను’ అని కొందరు.. మరికొందరేమో ‘పెయిట్ ఆర్టిస్ట్’ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన పోస్టులు పెట్టడానికేనా తమరికి సోషల్ మీడియా కట్టబెట్టింది? అని ప్రశ్నిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ‘ మీలాంటి వాళ్లకు పేమెంట్స్ దండగ.. ఇంత ఈజీగా దొరికిపోతారేంట్రా బాబూ..?’ అంటూ ఒరిజనల్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు కేటీఆర్ ఫ్యాన్స్. ఇదిగో ఇదీ అసలు విషయం అంటూ కేటీఆర్‌తో సెల్ఫీ దిగుతున్న ఓ అభిమాని ఫొటోను పోస్టు చేసి, కాస్త తెలుసుకోండ్రా అయ్యా.. ఇకనైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆపండ్రా బాబోయ్ అంటూ ట్రోలర్స్‌కు బీఆర్ఎస్ శ్రేణులు హితవు పలుకుతున్నారు. ట్రైన్‌లో ఎదురుగా ఓ మహిళ నిద్రపోతున్నారు. ఆమె ఎదురుగానే కేటీఆర్ కూర్చొని ఉన్నారు. ఆమె బ్యాగ్ అక్కడ పెట్టినట్లుగా ఉన్నారు. దీంతో ఆ బ్యాగ్‌ను రౌండప్ చేసి లేనిపోని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని కామెంట్స్, హీరోయిన్ ఫొటోలు చూస్తే ‘ఆపండి మహాప్రభో’ అని అనక తప్పదు.. అలా ఉన్నాయ్ మరి. చూశారా.. చిన్నపాటి పొరపాటుతో వ్యవహారం ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్లిందో! అందుకేనండోయ్.. ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే అసలే టెక్నాలజీ ఈ రేంజిలో ఉన్నది.. అందులో సోషల్ మీడియా అంటే ఆరితేరిన మనుషులు ఉంటారు కదా.. నవ్వులపాలు కావడం ఎందుకబ్బా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Read Also- YS Jagan: పేదలకు మళ్లీ రేషన్ కష్టాలా.. సబబేనా చంద్రబాబు?

మహేష్ ట్వీట్‌లో ఇలా..

కేటీఆర్ ట్వీట్‌లో క్లియర్ కట్‌గా..

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?