swetcha special story on praneeth pranav leaf land issue
Top Stories, క్రైమ్

praneeth pranav leaf : విల్లా.. విలవిల.. తప్పొకరిది..? శిక్ష మరొకరికి..?

* శివారు భూముల్లో సమస్యలెన్నో
* ఫేక్ డ్యాకుమెంట్స్‌తో జోరుగా దందాలు
* అమ్ముకుని బయటపడుతున్న బిల్డర్లు
* లబోదిబోమంటున్న కొనుగోలుదారులు

– ‘‘ప్రణీత్ ప్రణవ్ లీఫ్’ ప్రాజెక్టులో పీటీ వివాదం
– 30 మంది విల్లాల ఓనర్లకి నోటీసులు
– విచారణలో తమ తప్పేం లేదన్న ప్రణీత్ సంస్థ
– తప్పులు చేసిన అధికారులపై చర్యలు ఎప్పుడు?
– పీటీ దారులకు న్యాయం జరిగేదెన్నడు?
– నగర భూములపై కత్తిలా వేలాడుతున్న రక్షిత కౌలుదారు చట్టం రికార్డ్స్
– న్యాయం చేయాలంటూ బాధితుల డిమాండ్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం

swetcha special story on praneeth pranav leaf land issue : హైదరాబాద్‌లో ప్లాట్ కొనాలన్నా, ఫ్లాట్ తీసుకోవాలన్నా, విల్లా తాళాలు అందుకోవాలన్నా, ఒకటికి వంద సార్లు పరిశీలించుకుంటే మంచిది. ఎందుకంటే, ఏ స్థలం మాటున ఏ లిటిగేషన్ ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. కనీసం 50 ఏండ్ల రెవెన్యూ రికార్డులు సరిచూసుకోవాలి. లేదంటే, మల్లంపేట్ ‘‘ప్రణీత్ ప్రణవ్ లీఫ్’ యజమానులు, బాధితులు ఎదుర్కొంటున్న చిక్కులే ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్ దారులు, ఓనర్స్ చివరి వరకు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మధ్యలో ఫేక్, ఫోర్జరీ డ్యాకుమెంట్లు పెట్టి అనుమతులు, నిర్మాణాలు చేపట్టిన వారు, వారికి అమ్మిన వారు ఎవరూ తాము పాత్రదారులం కాదంటూ కోర్టులో తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. అసలైన నేరస్థులపై క్రిమినల్ కేసులు నమోదు అయినా, చట్టం నుంచి తప్పించుకుంటారు. డబ్బులకు ఆశపడి, తప్పులు చేసిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసుల్లో విచారణలు చేయకపోవడం వలనే ఈ దందాలు ఇంకా కొనసాగుతున్నాయి. 2005లో ఆనాటి ఎమ్మార్వో రాజేందర్ చేసిన తప్పిదాల వలన 20 ఏండ్ల తర్వాత ఇప్పుడు న్యాయస్థానాల చుట్టూ బాధితులు తిరగాల్సి పరిస్థితి దాపురించింది.

అసలేం జరిగింది?

మల్లంపేట్ ఓఆర్ఆర్‌కు ఆనుకుని ఉంటుంది ‘‘ప్రణీత్ ప్రణవ్ లీఫ్’. హెచ్ఎండీఏ, రెరా అనుమతులతో సర్వే నెంబర్స్ 99, 100, 111, 112, 114, 115, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 154, 157, 158, 159, 161, 162, 163, 165లో 1198558 Sq.mt లో 502 విల్లాలు నిర్మించింది. ఇందులోని 121, 122 సర్వే నెంబర్స్‌లోని 1.34 ఎకరాల భూమి ఎంబరీ రాములు అనే కౌలు రైతుకి పీటీ రిజిస్టర్‌లో పేరు నమోదైంది. 1977లో సర్టిఫికెట్ ఇష్యూ చేశారు. మరోవైపు, పట్టాదారులు రికార్డుల్లో ఉన్నామని అమ్మేసుకున్నారు. 2005లో పీటీ దారులు ఉండటం గుర్తించారు. అదే అదునుగా సంతకం కూడా చేయలేని రాములు ఇంగ్లీష్‌లో సంతకాలు చేసినట్టు రికార్డులు సరెండర్ చేసినట్టు పత్రాలు సృష్టించారు. 1950 నుంచి అనుభవదారుని కాలంలో ఉన్న కౌలు దారుడి సంతకాలు, అనుమతులు లేకుండానే, 11-11-2005 లో అల్లూరు దీపిక, ఏఎస్ఎస్ఎన్ రాజు, మంథని ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ గోపాలకృష్ణ పేర్ల మీదకి మారిపోయింది. దీన్ని వెంకట ప్రణీత్ డెవలపర్స్ డెవలప్మెంట్‌కి తీసుకున్నారు. ‘‘ప్రణీత్ ప్రణవ్ లీఫ్’’ పేరుతో విల్లాలు నిర్మించారు. అయితే, (నెం: ఏ/16816/05) 11-11-2005న కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో రాజేందర్‌తో కలిసి అమ్మకందారులు కుట్రలు జరిపినట్టు తేలింది. వీరందరిపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి చార్జీషీట్ వేశారు.

ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్లు

నిందితులు ముందే పట్టాదారుడి నుంచి కొనుగోలు చేశారు. ఆ తర్వాత మరో వ్యక్తికి పీటీ దారుడు సరెండర్ చేస్తున్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అయితే, సరెండర్ చేస్తున్న వ్యక్తికి కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు అమ్మినట్లు ఎమ్మార్వో అక్రమంగా ఉత్తర్వులు ఇచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఏఎస్ఎస్ఎన్ రాజు, దీపిక (డాక్యుమెంట్ నెంబర్ 6722/2016, డాక్యుమెంట్ నెంబర్ 8897/2016 &8896/2016) ‘‘ప్రణీత్ ప్రణవ్ లీఫ్’’ కన్‌స్ట్రక్షన్ గ్రూప్‌కి అమ్ముకుని చేతులు దులుపుకున్నారు. వీరు హెచ్ఎండీఏ నుంచి 2018లో అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. దొంగ పత్రాలతో కొనుగోలు చేసిన లావాదేవీలు చెల్లవంటూ, పీటీదారులు టైటిల్ కోసం జాయింట్ కలెక్టర్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 337, 347, 345, 348, 350, 357, 349, 354, 373, 360,361, 359, 369, 358, 364, 388, 387, 386, 366, 341, 336, 381, 371, 349 ,346 ,380, 343, 353 నెంబర్స్ గల విల్లాలను కొనుగోలు చేయరాదు, అమ్మకం చేపట్ట వద్దని నోటీసులు జారీ అయ్యాయి. అట్లూరి దీపిక, ఏఎస్ఎస్ఎన్ రాజు, మంథని కన్‌స్ట్రక్షన్ అధినేత గోపాలకృష్ణ, వెంకట ప్రణీత్ అధినేత కేవీఎస్ నర్సింగరావులపై ఐపీసీ 420, 468, 467, 506, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. చార్జీషీట్ కూడా దాఖలు చేశారు.

ఇప్పుడేం చేయాలి?

హైదరాబాద్‌తో పాటు నగర శివార్లలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. పీటీ యాక్ట్ 1950 ప్రకారం, టైటిల్ దారుడికి ఎన్నో కేసుల్లో అనుకూలంగా తీర్పులు వచ్చాయి. నెలనెల జీతాలతో ఈఎంఐలు చెల్లించుకునే ఉద్యోగులపై ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పీటీ దారులు టైటిల్ ఉండటంతో వారంతా తమ వారసత్వపు భూమిని ఎలా కబ్జా చేశారో వివరంగా కేసులు వేశారు. న్యాయం చేయకపోతే విల్లాల ముందు నిరాహార దీక్షకు దిగుతామని, తామంతా పేద రైతులమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ ఆఫీసుల ముందు బీజేపీ లీడర్లతో కలిసి ధర్నాలు చేస్తున్నారు. దొంగ పేపర్లతో లాభపడ్డ వారికి శిక్షలు లేకపోవడం వల్లే ఇలాంటివి ఎదురవుతున్నాయి. తప్పించుకుతిరుగుతున్న వారు ముందుకు వచ్చి న్యాయం చేయాల్సి ఉంది. తప్పుడు పత్రాలతో ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. చివరికి నష్టపోయేది అమాయకంగా ఇల్లు కొనుగోలు చేసిన వారు. ఆనాటి పేద రైతులు. రాజకీయ అండదండలతో రియల్ ఎస్టేట్ పేరుతో కేవలం దశాబ్ద కాలంలోనే వేల కోట్లకు ఎదిగిన రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. తప్పు చేసిన వారికి శిక్షలు కఠినంగా ఉంటేనే మరో ప్రాజ్టెక్‌లో మోసాలు జరగకుండా ఉంటాయి.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?