BRS leader land kabja
Top Stories, క్రైమ్

Hyderabad: ‘కమ్మ’గా ఖానామెట్ భూమి కబ్జా

  • హైటెక్ సిటీకి దగ్గరలోని ఖానామెట్ భూమిపై కన్నేసిన బీఆర్ఎస్ నేత
  • కమ్మ సంఘానికి కేటాయించిన 5 ఎకరాల భూమి
  • అనుచరులతో కలిసి కబ్జాకు ప్రయత్నం
  • బీఆర్ఎస్ హయాం నుంచే కబ్జా చేసేందుకు పథకం
  • కోర్టు కేసుతో కమ్మసంఘానికి కేటాయించని భూమి
  • ఖాళీగా ఉన్న భూమిపై కన్నేసిన బీఆర్ఎస్ లీడర్
  • అడ్డుకుంటున్న స్థానిక ప్రజలు
  • అధికారులకు ఫిర్యాదులు
  • అడిగితే బెదిరింపులు

Near by Hightech city Khanapur want to occupation of costly land by BRS leader:
నగర శివార్లలో అది అత్యంత ఖరీదైన స్థలం. ఎందుకంటే హైదరాబాద్ హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో ఉంది. 2.3 ఎకరాల ప్రభుత్వ భూమిపై బీఆర్ఎస్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధి కన్నేశారు. తన అనుచరులు, బినామీలను పురిగొల్పి ఆ ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా స్థానిక ప్రజలు ఆ భూమిని ఎలాగైనా కాపాడాలని ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. వాస్తవానికి సదరు ఎమ్మెల్యే తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటినుంచే ఈ స్థలంపై కన్నేశాడు. పైగా బీఆర్ెస్ నేత కేసీఆర్ కు అతడు అత్యం సన్నిహితుడనే పేరు క ూడా ఉంది. అప్పట్లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ హైదరాబాద్ నగరంలో అన్ని కుల సంఘాలకు భవనాలు లేదా భూములు కేటాయించిన సంగతి తెలిసందే.

కమ్మ సంఘం భూమిని కలిపేసేందుకు

అందులో భాగంగానే కమ్మ సంఘానికి ఏ ప్రాంతంలో అయితే బాగుంటుందని ఆరా తీస్తుండగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హైటెక్ సిటీకి సమీపంలో ఉండే ప్రభుత్వ భూమి ఉదని సూచించినట్లు సమాచారం. వెంటనే కేసీఆర్ మరో ఆలోచన లేకుండా ఖానామెట్ గ్రామం, శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నంబర్ 1/1/2 లో మొత్తం 7.3 ఎకరాలు ఉండగా, అందులో 5 ఎకరాలను కమ్మ సంఘానికి జీవో.నంబర్ 214 ద్వారా 21.12.2021లో కేటాయించారు. దీనితో ఇదే సర్వే నంబర్ పక్కనే ఉన్న సుమారు 2.3 ఎకరాల భూమిని తన ఖాతాలో వేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు ప్రచారం జరిగింది. కానీ కోర్టు కేసు కారణంగా ఆ భూమిని కమ్మ సంఘానికి ప్రభుత్వం కేటాయింకపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.

కమ్మ లీడర్ కు ఫేవర్ గా..

అసలు హైటెక్ సమీపంలోని భూమిని కమ్మ సంఘానికి ఎందుకు కేటాయించాలనే అంశంపై సంబంధిత కమ్మ లీడర్ అప్పటి ప్రభుత్వ పెద్దలకు వివరించినట్లు ప్రచారంలో ఉంది. సదరు లీడర్ కు ఫేవర్ చేసేందుకే బీఆర్ఎస్ కీలక నేతలు అక్కడే కమ్మ సంఘానికి ఐదెకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అదే సామాజికవర్గానికి చెందిన కులస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే, బీఆర్ఎస్ పాలనలోనే అక్కడ నిర్మాణాలు చేయాలని సదరు లీడర్ ప్లాన్ వేశారు. కానీ విలువైన భూములను కమ్మ కుల సంఘానికి కేటాయించడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. ఈలోపు ప్రభుత్వం మారడంతో గులాబీ లీడర్ కబ్జా చేసేందుకు తన అనుచరులను రంగంలోకి దింపారనే ఆరోపణలు వస్తున్నాయి.

అనుమతులున్నాయా?

మొన్నటివరకు ఎలాంటి నిర్మాణాలు లేని ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను పాతేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక మున్సిపల్, విద్యుత్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్న తరువాతే పనులు మొదలయ్యాయా? లేక సదరు గులాబీ లీడర్ తనకున్న పలుకుబడితో పనులు చేయిస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ మున్సిపల్, ఎలక్ర్టిసిటీ డిపార్ట్ మెంట్స్ నుంచి అనుమతి తీసుకుంటే, ఎవరి పేర్లమీద దరఖాస్తు చేశారు? ఇంతకాలం సర్కారు భూమిగా ఉన్న ఆ స్థలం ఎవరి పేరుమీద రిజిస్ట్రేషన్ జరిగింది?అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!