BRS Silver jubilee (Image Source: Twitter)
తెలంగాణ

BRS Silver jubilee: ఆ ఒక్క సభపైనే ఆశలు? పడరాని పాట్లు పడుతున్న బీఆర్ఎస్?

BRS Silver jubilee: తెలంగాణను దశాబ్దకాలం పాటు పరిపాలించిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. నాయకుల వలసలు, కార్యకర్తల అసంతృప్తులతో కొట్టుమిట్టాడుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లోనూ ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్.. ప్రస్తుతం నిరాస, నిస్పృహలతో నిండిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ ద్వారా నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాని భావిస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పార్టీలో కొత్త ఉత్సాహం తిరిగి ఊరకలేస్తుందా? ఇప్పుడు పరిశీలిద్దాం.

కేసీఆర్ వరుస భేటీలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఫోకస్ మెుత్తం ప్రస్తుతం రజతోత్సవ సభ నిర్వహణపైనే ఉంది. సభను జయప్రదం చేసి తద్వారా కార్యకర్తల్లో జోష్ నింపాలని ఆయన భావిస్తున్నారు. ఈ లోపు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య మనస్పర్థలు, కార్యకర్తల అసంతృప్తులు, పార్టీపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో పడ్డారు కేసీఆర్. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస సమావేశాలు సైతం నిర్వహించారు. రజోత్సవ సభ నాటికి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని వారికి సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేటీఆర్ జిల్లాల పర్యటన
బీఆర్ఎస్ ముఖ్య నేత, కేసీఆర్ తనయుడు కేటీఆర్ (KTR) సైతం త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే తన పర్యటనపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. జిల్లాల టూర్ సందర్భంగా అక్కడి ముఖ్య నేతలు, పార్టీ క్యాడర్ తో సమావేశం కానున్నారు. అధికార కాంగ్రెస్ (Telangana Congress) తో పాటు, బీజేపీ (BJP) నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో నేతలు, కార్యకార్తలు ఎలాంటి నైరాశ్యంలోకి వెళ్లకుండా దిశానిర్దేశం చేయనున్నారు. ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ రజతోత్సవ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో.. ఆ దిశగా నేతలు, కార్యకర్తలు సంసిద్ధం కావాలని సూచించనున్నారు.

ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఏ చిన్న అవకాశం దొరికినా బీఆర్ఎస్ ను ఎండగడుతూ వస్తున్నారు. తన పవర్ ఫుల్ స్పీచ్ తో విపక్షాన్ని  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అటు క్షేత్రస్థాయిలోనూ కాంగ్రెస్ శ్రేణులు.. బీఆర్ఎస్ నేతల తప్పులను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రక్షణాత్మక పరిస్థితుల్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. సహజంగా ఇలాంటి సమయంలోనే పార్టీ అధినేత.. శ్రేణులకు అండగా నిలుస్తుంటారు. కానీ కేసీఆర్ విషయానికి వస్తే పూర్తిగా రివర్స్ లో ఉంది. పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన ఫామ్ హౌస్ దాటి బయటకు రావట్లేదన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేటీఆర్ కు పార్టీ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి నేతలను, పార్టీలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సముచిత గౌరవం ఇస్తామని, అసెంబ్లీకి రావాలని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెబుతున్నా కేసీఆర్ శాసనసభకు రాలేదు.

Also Read: Hyderabad to vijaywada toll fee: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన టోల్ రుసుములు.. ఎంతంటే?

రజతోత్సవంతో ఉత్సాహం వచ్చేనా!
ఏప్రిల్ 27న జరిగే రజతోత్సవ సభ నాటికి ఎలాగైనా పార్టీలోని లుకలుకలను చక్కదిద్ది పార్టీని తిరిగి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. ఆ దిశగానే పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీలు, కేటీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఎంతమేరకు సత్ఫలితాలు ఇస్తాయోనన్నది అనుమానమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీని తట్టుకొని నిలబడాలంటే కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. రజతోత్సవం సభలో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చి తిరిగి ఇంటికే కేసీఆర్ పరిమితమైతే పెద్దగా ప్రయోజనం ఉండదని విశ్లేషకలు చెబుతున్నారు. కార్యకర్తలు, నేతలు, ప్రజలతో మమేకమైనప్పుడే తిరిగి బీఆర్ఎస్ గాడిన పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేస్తున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు