Lokal Boi Nani
తెలంగాణ

Lokal Boi Nani : లోకల్ బాయ్ నాని.. ఇవేం దిక్కుమాలిన పనులు..!

Lokal Boi Nani : ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అంటే తెలియని సోషల్ మీడియా యూజర్లు ఉండరు. సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియోలు తీస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. టిక్ టాక్ సమయంలోనే మనోడి ఫిజిక్ తో అమ్మాయిల్లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అలాంటి నాని ఇప్పుడు సినిమాల్లో నటించే స్థాయి దాకా ఎదిగాడు.

యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తాయి ఇతని వీడియోలకు. లక్షల్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. అలాంటి నానిపై తాజాగా టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ (vs sajjanar) సీరియస్ అయ్యారు. గత కొంత కాలంగా నాని సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు సజ్జనార్.

ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ‘డబ్బులు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయని.. ఇవేం దిక్కుమాలిన పనులు. మీ ట్యాలెంట్ ను వేరే మార్గాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు. కానీ ఇలాంటి పనుల ద్వారా ఎంతో మంది యువతను బెట్టింగ్ కు బానిసలుగా మార్చడం మంచిది కాదు. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లం అని చెప్పి.. ఏం చేసినా నడుస్తుంది అనే భ్రమలో ఉండకండి. చట్ట ప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. ఇకనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆపండి’ అంటూ రాసుకొచ్చాడు సజ్జనార్. ఈ ట్వీట్ ను ఏపీ డీజీపీ, వైజాగ్ సిటీ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీసులకు ట్యాగ్ చేశాడు సజ్జనార్. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చూస్తుంటే నానిపై చర్యలు తప్పేలా లేవని అంటున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!