Uttam Kumar Reddy : ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో నిర్వహిస్తున్న ఆపరేషన్ ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టన్నెల్ లో (tunnel) చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నిపుణుల సమక్షంలో సహాయక చర్యలు చేపడుతున్నామని వివరించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komati reddy venkat reddy) కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సదర్భంగా టన్నెల్ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టన్నెల్ లో ఉన్న బోరింగ్ మిషిన్ ను కట్ చేసి బయటకు తీసుకొస్తామన్నారు. టన్నెల్ లో ప్రమాదం జరిగిన చోట డీ వాటరింగ్ చేసి రెస్క్యూ ఆపరేషన్ ను ముందుకు కొనసాగిస్తామన్నారు. ఎన్డీఆర్ ఎఫ్ తో పాటు ర్యాట్ హోల్ స్పెషలిస్టులు, ఆర్మీ నిపుణులు కూడా పనిచేస్తున్నారని.. తాము దగ్గరుండి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.