Uppal balu on Aghori (image credit:Twitter)
తెలంగాణ

Uppal balu on Aghori: లేడీ అఘోరీని ‘బావా’ అంటూ శ్రీవర్షిణి పిలుపు.. ఉప్పల్ బాలు ఫైర్..

Uppal balu on Aghori: లేడీ అఘోరీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలు ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో సీరియస్ వార్నింగ్ ఇస్తూ, శ్రీ వర్షిణి ఇప్పటికైనా తన ఆలోచన మార్చుకోవాలని ఉప్పల్ బాలు హితవు పలికారు.

శ్రీ వర్షిణిని ముచ్చటగా మూడవసారి పెళ్లి చేసుకున్న లేడీ అఘోరీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలలో శ్రీ వర్షిణికి లేడీ అఘోరీ తాళి కడుతుండగా పక్కన పలువురు మంత్రాలు చదువుతూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో లేడీ అఘోరీతో పాటు శ్రీ వర్షిణి సైతం తమ వివాహానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా లేడీ అఘోరీ.. చిన్ను అంటూ శ్రీ వర్షిణి అని పిలుస్తూ ముద్దు పెట్టగా, శ్రీ వర్షిణి.. బావ అంటూ పిలవడం విశేషం. బావ అంటూ పిలిచిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇంతకు అఘోరి, లేడీ అఘోరినా కాదా అన్న చర్చలు సైతం ఊపందుకున్నాయి. మొత్తం మీద వీరి వివాహం ముచ్చటగా మూడవసారి వేదమంత్రాల మధ్య సాగిందని చెప్పవచ్చు.

అయితే ఇటీవల మొదటి భార్యను నేను అంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని లేడీ అఘోరీ, మొదటి భార్యను తానేనంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా శ్రీ వర్షిణి, లేడీ అఘోరీ పెళ్లి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు సీరియస్ కామెంట్స్ చేశారు.

Also Read: AP Cabinet – CM Chandrababu: ఏపీలో హై రేంజ్ అసెంబ్లీ.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం..

లేడీ అఘోరీ వెంట ఉన్న శ్రీ వర్షిణి చదువుకుందని, కానీ ఆ జ్ఞానాన్ని ఎక్కడ పెట్టిందంటూ ఉప్పల్ బాలు కామెంట్ చేశారు. శవాన్ని పీక్కుని తింటూ జీవితాన్ని గడుపుతానని చెప్పిన అఘోరీ వెంట ఆమె ఎలా జీవనం సాగిస్తుందని ఉప్పల్ బాలు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు లేడీ అఘోరిని అరెస్టు చేసి జైల్లో వేయాలని, అప్పుడే తగిన శాస్తి జరుగుతుందని ఉప్పల బాలు కోరారు. ముఖానికి వికారంగా పౌడర్లు, లిప్ స్టిక్ లు పూసుకునే అఘోరీకి పెళ్లి అవసరమా అంటూ ఉప్పల్ బాలు ప్రశ్నించారు. బీటెక్ చదివే అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారని, ఇప్పటికైనా శ్రీ వర్షిణి అసలు నిజాన్ని తెలుసుకుని సమాజంలోకి రావాలని ఉప్పల్ బాలు కోరారు.

మరి లేడీ అఘోరీ, శ్రీ వర్షిణి వివాహానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు ఇంత వరకు స్పందించని పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో లేడీ అఘోరీ ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు, ఆ సమయానికి వర్షిణి తల్లిదండ్రులను ఒప్పించి ఆశ్రమానికి తీసుకువస్తానని అఘోరీ కామెంట్స్ చేయడం మరో విశేషం.

 

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

 

uppal balu (@uppalbaluofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!