Tummala Nageswara Rao: వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ
Tummala Nageswara Rao (imagecredit:swetcha)
Telangana News

Tummala Nageswara Rao: వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయించాలి: తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao: వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాల(Micro irrigation devices)పై విధిస్తున్న 12% జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ను కలిశారు. రాష్ట్ర రైతులు, నేతన్నలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరిస్తూ మూడు కీలక లేఖలను అందజేశారు.

రైతులపై ఆర్థిక భారం

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యానవన రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, రైతులకు ఆధునిక యంత్రాలు, నీటిపారుదల సాంకేతికత అందుబాటులో ఉంటే ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. రైతులపై ఆర్థిక భారం తగ్గించడానికి, ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా, చిన్న రైతులు కూడా సాంకేతికతను ఉపయోగించుకునేందుకు వీలుగా, ఉత్పాదకతను పెంచి దేశ ఆహార భద్రత మరింత బలపడాలంటే వ్యవసాయ యంత్రాలు(Agricultural machinery), పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఉన్న 12% జీఎస్టీని మినయించాలని కోరారు.

Also Read: MLC Kavitha: కీలక నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత?.. ప్రకటన ఎప్పుడంటే?

రైతులకు తీవ్ర సమస్య

హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై 5% జీఎస్టీ విధించడం నేతన్నల ఉత్పత్తులు మార్కెట్లో పోటీ తట్టుకోలేని పరిస్థితిని తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఉత్పత్తుల ధరలు పెరిగి, వినియోగదారుల డిమాండ్ తగ్గి, నేతన్నలు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో నేతన్నలు తమ సాంప్రదాయ వృత్తిని వదిలి వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. హ్యాండ్లూమ్ ఉత్పత్తులను జీఎస్టీ(GST) నుండి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల క్రూడ్ పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5% నుంచి 16.5%కి తగ్గించడం రైతులకు తీవ్ర సమస్యగా మారిందని, దీని వల్ల దేశీయ ధరలు క్షీణించి రైతులకు చెల్లించే ప్రెష్ ప్రూట్ బంచేస్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో ఉన్నట్లుగా 44% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని కోరారు.

Also Read: CM Revanth Reddy: లబ్ధిదారుల క్షేమ సమాచారం తెలుసుకున్న.. సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..