Department of Education
తెలంగాణ

Telangana: కొత్త టీచర్లకు ట్రైనింగ్.. విద్యాశాఖ బిగ్ ప్లాన్

Training for New Teachers: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అందుకోసం డీఎస్సీ 2024 ద్వారా నూతనంగా నియామకమైన 10,006 మంది టీచర్లకు మూడు రోజుల‌పాటు శిక్ష‌ణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఎంపికైన టీచ‌ర్ల‌ను బ్యాచ్‌ల వారీగా డివైడ్ చేసి, వివిధ స్పెల్స్‌లో వారికి శిక్షణ అందించనున్నారు. ఈ ట్రైనింగ్ ఈ నెల 28 నుంచి మార్చి 12 వరకు కొనసాగనుంది. ప్రైమరీ టీచర్లకు 28, మార్చి 1, 3 తేదీల్లో మూడ్రోజుల పాటు శిక్షణనివ్వనున్నారు. హైస్కూల్ టీచర్లకు మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు మూడ్రోజులపాటు, స్పెషల్ ఎడ్యుకేషన్ల టీచర్లకు వచ్చే నెల 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

జిల్లాల్లో డిస్ట్రిక్ట్ రిసోర్స్ ప‌ర్స‌న్స్‌

డీఎస్సీ 2024 ద్వారా రిక్రూట్ అయిన టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లను నియమించారు. వారికి మార్చి 3 వరకు విడుతల వారీగా శిక్షణ అందించనున్నారు. ఇక‌ ప్రైమరీ టీచర్లకు నూతన జిల్లా కేంద్రాల్లో ట్రైనింగ్ జరగనుంది. హైస్కూల్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ట్రైనింగ్ కొనసాగించనున్నారు. అయితే ఆయా జిల్లాలవారీగా వేదికలు ఎక్కడన్న అంశంపై జిల్లా విద్యాశాఖ అధికారులు రెండు, మూడు రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఎస్జీటీలకు ఒక్కో బ్యాచ్ కి 40 నుంచి 45 మంది చొప్పున కొత్త జిల్లాల కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వాస్తవానికి ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు తొలుత నిర్ణయించుకున్నారు. అదేరోజు ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో ఒకరోజు వాయిదా వేశారు. శిక్షణ జరిగే తేదీల్లో ఎలాంటి సెలవులు ఇవ్వరాదని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. శిక్షణలో పాల్గొనేవారికి టీఏ, డీఏ సైతం కల్పించనున్నారు.

సరిగ్గా బోధించినప్పుడే చదవడం, రాయడం నేర్చుకుంటారు : నరసింహారెడ్డి

ఉపాధ్యాయులు సరిగ్గా బోధించినప్పుడే విద్యార్థులు.. చదవడం, రాయడం నేర్చుకుంటారని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. తెలంగాణలో నూతనంగా రిక్రూట్ అయిన టీచర్లకు శిక్షణనిచ్చేందుకు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లకు రెండ్రోజుల పాటు నిర్వహించిన ట్రైనింగ్ శనివారంతో ముగిసింది. రాజేంద్రనగర్ టీజీఐఆర్టీలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా విద్యార్థులను ఒక నిమిషంలో ఎన్ని పదాలు చదువగలుగుతారో పరీక్షిస్తున్నారని, కానీ ఉపాధ్యాయులు ఎవరికి వారు ఎప్పుడైనా ఒక్క నిమిషంలో ఎన్ని పదాలు చదువగలరో పరీక్షించుకున్నారా? అని డీఆర్పీలను ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ సమన్వయం చేసుకుని బోధించేలా టీచర్లకు హ్యాండ్ బుక్స్ ఇచ్చామని, వాటిని సరిగ్గా బోధించగలిగినప్పుడే విద్యార్థులు.. చదవడం, రాయడం నేర్చుకుంటారని తెలిపారు. సంవత్సరాల తరబడి పిల్లలు పాఠశాలకు వెళ్తున్నా చదవడం రాయడంలో వెనుకబడి ఉన్నారన్నారు. దీన్ని అధిగమించాలంటే పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్ ల ఆధారంగా బోధిస్తే చక్కటి ఫలితాలు సాధిస్తామని వవరించారు. సాంకేతికను వినియోగిస్తూనే.. పూర్తిగా దానిపైనే ఆధారపడకుండా మానవ వరులను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, కరికులం డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ తహసీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!