Mahesh Kumar Goud: బీజేపీకి కట్టు బానిసలో కేటీఆర్ పనిచేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకు బీజేపీతో బీఆర్ ఎస్ ఒప్పందాలను కుదుర్చుకున్నదన్నారు. ఇంటర్నల్ ఒప్పందాలతోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పనిచేశాయన్నారు. లిక్కర్ స్కామ్ తో తెలంగాణకు అగౌరవం తీసుకువచ్చారన్నారు.
Also Read: Hydra Ranganath:హైదరాబాద్ లో ఇలా చేయకుంటే ప్రమాదమే.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక..!
పదేళ్ల బీజేపీ, బీఆర్ ఎస్ లు అనాలోచిత నిర్ణయాలను తీసుకున్నదన్నారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నారన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన బీఆర్ ఎస్ పై కేంద్రం చర్యలు తీసుకోకుండా సపోర్టు చేసిందన్నారు.
రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను,నిధులను ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందన్నారు. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన బీజేపీకి, పార్లమెంట్ లో అన్ని రకాలుగా బీఆర్ ఎస్ సహకరించిందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయం పడుతున్నారని వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు