Maoist surrender: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ప్రముఖ మావోయిస్టు రాంధర్(Randhar) తన సహచరులు 12 మందితో పోలీసుల ఎదుట ఆయుధాలతో సహా సరెండర్ అయ్యాడు. ఈ ఘటనతో ఎంఎంసీ జోన్ లు నక్సల్స్ రహితంగా మారినట్లు పోలీసులు వెల్లడించారు. సరెండర్ అయిన వారిలో డిబిసిఎం(DBCM) మెంబర్ చందు ఉసెండి, డివి సీఎం మెంబర్ లలిత, డిబిసిఎం మెంబర్ జానకి, డివి సీఎం మెంబర్ ప్రేమ్, ఏసీఎం సభ్యుడు రామ్ సింగ్ దాదా, ఏసీఎం సభ్యుడు సుఖేష్ పొట్టం, పీఎం మెంబర్ లక్ష్మి, పీఎం మెంబర్ షీలా, పీఎం మెంబర్ సాగర్, పీఎం మెంబర్ కవిత, పీఎం మెంబర్ యోగితలు లొంగి పోయారు.
లొంగిపోయిన వారిలో..
రాంధర్ మజ్జి – CCM – AK47
చందు ఉసెండి – DVCM – 30 కార్బన్
లలిత – డివిసిఎం – ఏదీ లేదు
జానకి – DVCM – INSAS
ప్రేమ్ – DVCM – AK47
రాంసింగ్ దాదా – ACM – 303
సుకేష్ పొట్టం – ACM – AK47
లక్ష్మి – PM – INSAS
షీలా – PM – INSAS
సాగర్ – PM – SLR
కవిత – PM – 303
యోగిత – PM – ఏదీ లేదు
రాంధర్ లొంగిపోవడం వల్ల MMC, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్ జోన్‌లు, అక్కడి ప్రాంతాలను నక్సల్ రహితంగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు.

