Road Accident: తెల్లవారుజామున TG 04 A 4744 టాటా ఆల్ట్రోజ్ కారులో వియం.బంజర వైపు నుండి సతుపల్లి వెళ్తు కిష్టారం, అంబేద్కర్ కాలనీ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సత్తుపల్లి కొంపల్లి కాలనీ చెందిన విద్యార్డులు సిద్దెసి జయ్ (18సం) మార్సకట్ల శశి, (11సం) చంద్రుగొండ మండలం, మహబూబ్ నగర్ చెందిన సాజిద్ (25 సం)అక్కడికక్కడే మృతి చెందారు.
ఇమ్రాన్ లకు తీవ్ర గాయాలు
మరో ఇద్దరు యువకులు తలారి అజయ్, ఇమ్రాన్ లకు తీవ్ర గాయాలు కావడంతో సమాచారం తెలుసుకున్న స్థానిక సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి, పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి హాస్పిటల్ కు తరలించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాదానికి సంబంధించి విచారణ జరుపుతున్నట్టు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
Also Read: Road Accident: ఓఆర్ఆర్ పై ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. 8 మంది ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్లు?
ప్రమాదంపై.. ఖమ్మం స్పందించిన పోలీస్ కమిషనర్
దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.
వాహన పరిస్థితిని తనిఖీ చేసుకోవాలి
పొగమంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనదారులు, పాదచారులను గమనించే సామర్థ్యం గణనీయంగా తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా వాహనాలను వేగంగా నడపకూడదని, ముందుగా వాహన పరిస్థితిని తనిఖీ చేసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడటం, అనుకోకుండా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వంటి ప్రమాదకర చర్యలు పూర్తిగా నివారించాలని సూచించారు.

