Telangana BJP (image credit:Twitter)
తెలంగాణ

Telangana BJP: బిజెపిలో అయోమయం.. రోజుకో పేరు తెరపైకి.. ఇంతకు ‘చీఫ్’ ఎవరు?

Telangana BJP: తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ అంశంపై అయోమయం నెలకొంది. ఎవరికివ్వాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రోజు ఒక్కో నేత పేరు ప్రచారంలోకి వస్తుండటంతో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గందరగోళంగా మారింది. సామాజికవర్గాల సమీకరణాల నేపథ్యంలో స్టేట్ చీఫ్ నియామకం ఉంటుందని తొలుత చర్చ జరిగినా తాజాగా రోజుకో నేత, అందులోనూ ఊహకందని వారి పేర్లు వస్తుండటంతో కేడర్ లో గందరగోళం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

ఈ అంశానికి ఎప్పుడు చెక్ పడుతుందోనని శ్రేణులు వేయి కండ్లతో ఎదురుచూస్తుండగా.. ఆశావహుల్లో మాత్రం గుబులు మొదలైందని తెలుస్తోంది. ఎందుకంటే రోజుకో నేత పేరు చర్చలోకి వస్తుండటంతో స్టేట్ చీఫ్ జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోననే ఆందోళన మొదలైందని సమాచారం.

ఇదిలా ఉండగా ఉగాది వరకు స్టేట్ చీఫ్​ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో స్టేట్ చీఫ్ నియామకం ఉగాది నాటికి పూర్తవుతుందా? అనే అనుమానాలు శ్రేణుల్లో మొదలయ్యాయి. ఎందుకంటే ఈనెల 30న ఉగాది ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ శోభా కరంద్లాజే నామినేషన్లను స్వీకరించలేదు. దీంతో ఉగాది తర్వాతే.. ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ మొదలైంది.

Also Read: CM Revanth Reddy: నేపాల్ రాజు కథ చెప్పిన సీఎం రేవంత్.. అందులో అంత అర్థం ఉందా?

ఎందుకంటే ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. కనీసం ఉగాది తర్వాత నామినేషన్లు తీసుకుని స్టేట్ చీఫ్ ను అనౌన్స్ చేసినా పార్టిసిపేషన్ డౌటే అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ స్టేట్ చీఫ్ ను ప్రకటించినా నూతన స్టేట్ చీఫ్ మంచి ముహూర్తం చూసుకున్నాకే స్టేట్ ఆఫీస్ కు వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఉగాది తర్వాతే అనౌన్స్ మెంట్ వచ్చే చాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు.

తెలంగాణ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ శోభా కరంద్లాజే రాకకోసం శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఆమె వచ్చిందంటే స్టేట్ చీఫ్ నియామకం ప్రక్రియ మొదలైనట్లేనన్నది తెలిసిందే. వచ్చీ రాగానే నామినేషన్ స్వీకరణ, ఆపై పోటీలో ఉన్నవారితో వన్ టు వన్ మీటింగులు, బుజ్జగింపులు పూర్తిచేసి ప్రెసిడెంట్ అనౌన్స్ మెంట్ చేసి వెళ్లే అవకాశాలున్నాయి.

ఈ ప్రక్రియ అంతా కేవలం ఒక్కరోజులోనే పూర్తయ్యే చాన్స్ ఉంది. కానీ బీజేపీ రాష్​ట్ర అధ్యక్ష రేసులో ఎంతో మంది ఉండటంతో ఆమె ఎవరి నుంచి నామినేషన్ స్వీకరిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. దాదాపు ఏడాదికాలంగా స్టేట్ చీఫ్ అంశంపై నెలకొన్న సందిగ్ధతపై అధిష్టానం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Also Read: Ramzan Holidays: ఒక్కరోజు కాదు.. రెండు రోజులు.. ప్రభుత్వం తాజా ప్రకటన ఇదే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!