government junior colleges (imagcredit:twitter)
తెలంగాణ

Government junior Colleges: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో.. ప్రిన్సిపాళ్లకు దిశానిర్దేశం

Government junior Colleges: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా 2025-26 విద్యాసంవత్సరానికి కనీసం లక్ష మందిని చేర్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈసారి అనుకున్న టార్గెట్ లో సగం వరకు కూడా బోర్డు అధికారులు రీచ్ అవ్వలేదు. 40 వేల వరకు మాత్రమే అడ్మిషన్లు పొందినట్లు తెలుస్తోంది. అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఇటీవల ఇంటర్ బోర్డు సెక్రటరీ ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఈనెలాఖరు వరకు ప్రవేశాలకు గడువు ఉండటంతో అడ్మిషన్లు పెంచుకోవడంపై దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కాలేజీల విశిష్టతలు వివరించాలని బోర్డు అధికారులు ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

తెలంగాణలో మొత్తం 430 ప్రభుత్వ కళాశాలలు

తెలంగాణలో మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కాగా వాటిలో అడ్మిషన్లు పెంచుకోవడంపై ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఫోకస్ పెట్టాలని బోర్డు అధికారులు ఆదేశించారు. లక్ష మంది విద్యార్థులను చేర్చుకోవాలని నిర్ణయించగా 40 వేల వరకు మాత్రమే అవ్వడంతో మరింత సీరియస్‌గా పనిచేయాలని బోర్డు స్పష్టంచేసినట్లు తెలిసింది. అందుకు ప్రతి అధ్యాపకుడు ప్రణాళికాబద్ధంగా స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, తల్లిదండ్రులను కలుస్తూ సమన్వయంతో అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనాలని సూచించింది. కళాశాలల్లో ఉన్న సదుపాయాలు, అవసరాలను గుర్తించి సంబంధిత ప్రతిపాదనలను విద్యాశాఖకు తక్షణమే సమర్పించాలని ఆదేశించింది.

Also Read: Plane Crash: పాపం.. భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి..

అడ్మిషన్ల పెంపుదలపై దృష్టి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విశిష్టతలను విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియపరుస్తూ అడ్మిషన్ల పెంపుదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులు స్పష్టంచేశారు. అవి అడ్మిషన్లలో కీలకంగా సహాయపడతాయని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, కెరీర్ మార్గదర్శకత్వం, వృత్తివిద్యా కోర్సులు, ఒత్తిడిలేని, సానుకూల విద్యా వాతావరణంలో విద్యా ప్రణాళికలు, అర్హత కలిగిన, అంకితభావంతో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఆట మైదానాలు, కంప్యూటర్ ల్యాబ్స్, సమగ్ర అభివృద్ధికి కేంద్రంగా వివిధ సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు. ఇలాంటి ప్రత్యేకతలను హైలైట్ చేస్తూ అడ్మిషన్ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని బోర్డు అధికారులు దిశానిర్దేశం చేశారు.

ప్రైవేట్ కాలేజీల్లో ఫెయిలైన విద్యార్థులు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు 5,09,403 మంది హాజరయ్యారు. ఇందులో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చేరగా ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఫలితాలు వెల్లడిస్తే మరికొంతమంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అధికారుల ఆకాంక్షకు అనుగుణంగా విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరుతారా? లేక ప్రైవేట్ వైపునకే మొగ్గు చూపుతారా? అనేది చూడాలి.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ఈనెల 16న అధికారలు వెల్లడించనున్నారు. అందుకు అనుగుణంగా వారు ఏర్పాట్లలో ఉన్నారు. ఇటీవలే సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు వాల్యుయేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టి మూల్యంకనం ప్రక్రియను పూర్తిచేశారు. కాగా ఈనెల 16న మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. విద్యార్థులు https://tgbie.cag.gov.in లేదా http://results.Cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని బోర్డు అధికారులు సూచించారు.

Also Read: Diabetes Temple: మీకు షుగర్ ఉందా.. ఆ గుడికి వెళ్తే సరి.. ఇక రోజూ స్వీట్స్ తినొచ్చు!

 

 

Just In

01

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు