Central Electricity Authority: 2026 సంవత్సరంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లుగా ఉండొచ్చని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసిందని, కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ అంచనాలను సైతం దాటే అవకాశం ఉందని ఇంధన శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. విద్యుత్ సౌధలో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీతో ఆ డిస్కం పరిధిలోని జిల్లాల్లో రాబోయే ఐదేండ్ల విద్యుత్ డిమాండ్ పై కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక, ఇతర రంగాల అభివృద్ధిని బట్టి చూస్తే 2026 ఆర్ధిక సంవత్సరంలో గరిష్ట డిమాండ్ 19000 మెగావాట్ల నుంచి 19,500 మెగావాట్లను మించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా విద్యుత్ అధికారులు నెట్ వర్క్ ను బలోపేతం చేసేలా ప్రణాళికలు రచించాలని సూచించారు.
ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లతో భేటీ
విద్యుత్ సౌధలో ప్రముఖ ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతో సందీప్ కుమార్ సుల్తానియా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోందని, దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి రాష్ట్రంలో 6000 ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యం గా పెట్టుకుందని సుల్తానియా తెలిపారు. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఆపరేటర్లు త్వరితగతిన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేశారు.
Also Read: Modi Praises Chandrababu: ఆ విషయంలో చంద్రబాబే స్ఫూర్తి.. సీక్రెట్ రివీల్ చేసిన ప్రధాని మోదీ