Interviews Controversy: డిప్యూటీ ఈవో ఇంటర్వ్యూలపై రచ్చ
Interviews Controversy (imagecredit:twitter)
Telangana News

Interviews Controversy: డిప్యూటీ ఈవో ఇంటర్వ్యూలపై రచ్చ.. ఇంటర్వ్యూలు ఉంటాయంటున్న టీజీపీఎస్సీ

Interviews Controversy: రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ వర్సెస్ విద్యాశాఖ అన్నట్లుగా పరిస్థితి మారింది. డిప్యూటీ ఈవో ఇంటర్వ్యూల అంశంపై అటు టీజీపీఎస్సీ(TGPSC), ఇటు విద్యాశాఖ నడుమ పంచాయితీ సాగుతోంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తీరుతామని టీజీపీఎస్సీ పట్టుబడుతుండగా.. అత్యున్నతమైన గ్రూప్ పోస్టులకే ఇంటర్వ్యూలు రద్దు చేసినప్పుడు ఈ పోస్టులకు ఎందుకని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్టేట్ లో 28 డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి విద్యాశాఖ నిర్ణయించింది.

 డిప్యూటీఈఓ పోస్టులకు ఇంటర్వ్యూలు

ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ పోస్టులతో పాటు డీఈడీ, బీఈడీ, ఎస్​సీఈఆర్టీలోని ఖాళీల భర్తీ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గతంలో టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్లను ఇచ్చారు. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ అధికారులు.. డిప్యూటీఈఓ పోస్టులకు ఇంటర్వ్యూలు పెట్టాలనే ప్రతిపాదనను జీఏడీకి రాశారు. ఈ ప్రపోజల్​ను జీఏడీ అధికారులు.. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు పంపించారు. అయితే, గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర ప్రధానమైన పోస్టుల భర్తీలో పారదర్శకత కోసం గతంలోనే ఇంటర్వ్యూలను రద్దు చేశారు. కేవలం రాత పరీక్ష మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరుగుతున్నాయి. ఇప్పుడు డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి మాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించడం సరికాదని విద్యాశాఖ అధికారులు సర్కారుకు రిప్లై ఇచ్చారు.

Also Read: Illegal Construction: ఎల్లంపేటలో అక్రమ నిర్మాణంపై అధికారుల చర్యలు శూన్యం.. కారణం ఎంటో..?

సిద్ధమవుతున్న అభ్యర్థులు

ఇది జరిగి దాదాపు మూడు నెలలు దాటింది. అయినా ఇప్పటికీ డిప్యూటీఈఓ పోస్టుల భర్తీపై టీజీపీఎస్సీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్ డిప్యూటీఈఓలు మాత్రమే ఉండగా, వారంతా ఇన్చార్జీ డీఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. మరోపక్క, డిప్యూటీ ఈవో పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ గందరగోళం మొదలైంది. ఇంటర్వ్యూలు ఉంటాయా? ఉండవా? అనే స్పష్టత లేకపోవడంతో ప్రిపరేషన్‌పై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్రూప్ 1 తరహాలోనే డిప్యూటీ ఈవోలకు కూడా ఇంటర్వ్యూలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Also Read: Mega Twins: మెగా వారసులు వచ్చేందుకు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?