TG on Vehicles(image credit:X)
తెలంగాణ

TG on Vehicles: ఆ వాహనాలకు ఇవి తప్పనిసరి!.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు!

TG on Vehicles: రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్​ అయిన పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్​ ప్లేట్లు (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్​ చీఫ్ సెక్రటరీ వికాస్​ రాజ్​ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమర్చేందుకు సెప్టెంబర్ 30, 2025 వరకు ప్రభుత్వం గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

గడువులోగా హై సెక్యురిటీ నంబర్​ ప్లేట్లు అమర్చుకోకపోతే వాహన యాక్టివ్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం ఉత్తర్వులో స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నవంబర్ 4, 2024న ఇచ్చిన తీర్పు (డబ్ల్యూపీ నెం.13029/1985) ఆధారంగా, కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనలను అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రతిపాదనలతో కూడిన ఈ జీవోలో వాహన తయారీదారులు, డీలర్లు, హెచ్‌ఎస్‌ఆర్‌పీ తయారీ సంస్థలు, వాహన యజమానులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

వాహన యజమానులు పోర్టల్ www.siam.in ద్వారా హెచ్‌ఎస్‌ఆర్‌పీ బుక్ చేసుకోవాలని, రూ.320 నుంచి రూ.860 వరకు ఫీజు చెల్లించాలని ఆదేశించారు. టూ వీలర్​ వాహనాలకు రూ.320–380, ఫోర్​ వీలర్​ వాహనాలకు రూ.590–700, కమర్షియల్ వాహనాలకు రూ.600–-800 ఖర్చు అవుతుందని వికాస్ రాజ్ పేర్కొన్నారు.

Also read: Panjagutta police: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వింత కేసు.. నమోదు చేసిన పోలీసులు..

ఈ ప్రక్రియలో వాహన తయారీదారులు, డీలర్లు హెచ్‌ఎస్‌ఆర్‌పీని పెట్టేందుకు అధీకృత తయారీ సంస్థల నుంచి మాత్రమే సేకరించాలని, షోరూమ్‌లలో ధరల వివరాలు ప్రదర్శించాలని సూచించారు. అమరిక తర్వాత ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, వినియోగదారుల ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే డీలర్లు, తయారీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రోజువారీ నివేదికలను ట్రాన్స్‌పోర్ట్ శాఖకు సమర్పించాలని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లు హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలకు సర్టిఫికెట్లు జారీ చేయకూడదని, జిల్లా రిజిస్టరింగ్ అథారిటీలు ఇటువంటి వాహనాల లావాదేవీలను నిషేధించాలని ఆదేశించారు. నకిలీ హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్లతో వాహనాలు కనిపిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి  https://epaper.swetchadaily.com/

Just In

01

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!