Telangana Weather Update: పొద్దంతా విపరీతమైన ఎండలు సాయంత్రం వేళ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వానలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ లను వాతవరణ శాఖ జారీచేసింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచనలు ఉన్నాయని అధిక ఎండల నేపథ్యంలో నేడు ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ను వాతవరణ శాఖ జారీచేసింది.
ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాల నేపథ్యంలో తూర్పు జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్న ఈదురుగాలులు:
అదే విధంగా నేడు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ. నేటి నుంచి రానున్న నాలుగు రోజులు ఇదే విధమైన పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. హీట్ వేవ్‌పై 12 విభాగాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. వడగాలుల పై హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ వున్నదని,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కన్నారు. వడదెబ్బ మరణించిన వారికి ఎక్స్ గ్రేషియో రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచాతామనొ మంత్రి అన్నారు. ప్రజలు ఎండకు అప్రమత్తంగా వుండాలని అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్ల సరఫరా చేసి ప్రజలకు అందుభాటులో ఉంచాలని మంత్రి అన్నారు.