Panchayat Secretary(image credit: X)
తెలంగాణ

Panchayat Secretary: ఆ శాఖలో బదిలీల టెన్షన్.. ఎమ్మెల్యే సిఫారసే కీలకమా?

Panchayat Secretary: పంచాయతీ కార్యదర్శుల బదిలీ పంచాయితీ స్టార్ట్ అయింది. 9 నెలల కిందనే కార్యదర్శులను బదిలీ చేశారు. మళ్లీ ఇప్పుడు బదిలీ ప్రక్రియ అంశం తెరపైకి రావడంతో వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వ నిర్ణయాలా? మంత్రుల సొంత నిర్ణయమా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే ఉద్యోగం స్థిరంగా ఉంటుందని లేకుంటే బదిలీయే అనే ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 80 ప్రకారం 9 నెలల క్రితం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో 40శాతం ఉద్యోగులను బదిలీలు చేసింది. అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖకు చెందిన కార్యదర్శులను సైతం బదిలీ చేశారు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సొంత విలేజ్ కు కాకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ చేయవచ్చని ఉంది. అందులో భాగంగానే బదిలీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఉద్యోగం సైతం చేస్తున్నారు.

అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం బదిలీలు మళ్లీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్యదర్శుల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క జిల్లాలో ప్రత్యేకంగా బదిలీకి శ్రీకారం చుట్టబోతుండటం కక్షసాధింపు చర్యలే అని పలువురు మండిపడుతున్నారు. సెక్రటరీల నుంచి ఇప్పటికే ఆప్షన్లు తీసుకుంటుండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్ కు అనుకూలమని?
పంచాయతీ కార్యదర్శులపై ఓ అపవాదు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపాయింట్ మెంట్ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు మంత్రులపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండుమూడు నెలలుగా బదిలీల విషయంలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రి, అధికారుల మధ్య పలు ధపాలుగా చర్చ జరిగినట్లు తెలిసింది.

Also read: Panjagutta police: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వింత కేసు.. నమోదు చేసిన పోలీసులు..

నేతల అభిప్రాయం మేరకు వరంగల్ ఇన్ చార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కార్యదర్శుల బదిలీలు చేపట్టాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒకే గ్రామంలో ఏడాదికి పైగా విధులు నిర్వరిస్తున్న కార్యదర్శుల జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది.

గ్రామాబివృద్ధికి కార్యదర్శులు నిధులు
పంచాయతీలకు సర్పంచులు లేకపోవడంతో వాటి నిర్వహణ భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడుతుంది. ఒక్కో గ్రామపంచాయతీలో 15 నెలలుగా ఒక్కో కార్యదర్శి సుమారు 2లక్షల వరకు వివిధ పనులు, అభివృద్ధి, మౌలిక సదుపాల కోసం సొంతనిధులు ఖర్చు చేయగా, మేజర్ గ్రామపంచాయతీలో 2 నుంచి 5లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఒకవేళ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తే తాము ఖర్చు చేసిన నిధులు ఎలా వస్తాయనేది ప్రశ్నార్ధమైంది.

ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ ఒక నియోజకవర్గంగానీ, మరో జిల్లాకు గానీ బదిలీ చేస్తే తమ పరిస్థితి ఏంటనేది కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతి నుంచి అభివృద్ధికి నిధులు కేటాయించి రాకపోతే పరిస్థితి ఏంటనేది కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగుకు మినహాయింపు?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ను మాత్రం మినహాయించినట్లు సమాచారం. కార్యదర్శుల బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హనుమకొండ జిల్లాలో 130 మంది, భూపాలపల్లిలో 122, వరంగల్‌లో 180, మహబూబాబాద్‌లో 190, జనగామ లో 100 మందిపైగా బదిలీ కానున్నట్లు తెలిసింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి నుంచి ఆప్షన్లు తీసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గం కాకుండా మండల యూనిట్ గా చేసుకొని బదిలీ చేయాలని కార్యదర్శులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. బదిలీలు ఆపాలని హన్మకొండ, వరంగల్ జిల్లాలో కలెక్టర్లకు కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు.

Also read: TG AICTE: గైడ్ లైన్స్ పాటించని యాజమాన్యాలకు.. ప్రభుత్వం చెక్!

స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు కీలకం!
కార్యదర్శులకు బదిలీలు కాకుండా ఉండాలంటే ఎమ్మెల్యే సిఫార్సు కీలకంగా మారింది. లెటర్ ఉంటే చాలు ఆయన ఉద్యోగం పనిచేసే చోటనే ఉంటుంది. లేకుంటే అతడి మార్పు తథ్యం అని ప్రచారం సైతం ఊపందుకుంది. సిఫార్సు లెటర్ల కోసం కార్యదర్శులు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారా? లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించకపోవడంతోనే బదిలీలకు శ్రీకారం చుడుతున్నారా? అనే చర్చజరుగుతుంది.

మంత్రి, ఇన్ చార్జీ మధ్య గ్యాప్?
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా సీతక్క ఉన్నారు. ఇన్ చార్జీ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఇద్దరు కార్యదర్శుల బదిలీ ప్రక్రియ చేపడితే అధికారంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పొంగులేటి మాత్రమే అధికారులకు మౌలిక ఆదేశాలు ఇచ్చి బదిలీ చేయమన్నారనే ప్రచారం జరుగుతుంది. సీతక్కనే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కానీ ఇన్ చార్జీ మంత్రి కార్యదర్శుల బదిలీలకు చొరవ చూపడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ట్రాన్స్ ఫర్లకు వ్యతిరేకం కాదు
టీపీ ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్
కార్యదర్శుల బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. కానీ నియోజకవర్గంగానీ, జిల్లాకు గానీ బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పటికే పంచాయతీలకు సర్పంచ్ లు లేకపోవడంతో సొంత నిధులు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒక్కో కార్యదర్శి అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు.
దీంతో ఆర్థికంగా చితికి పోయారు. బదిలీ చేస్తే ఖర్చు చేసిన నిధుల మంజూరీలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. చేసిన ఖర్చులకు నిధులు మంజూరు చేసి ఆ తర్వాత బదిలీ చేయాలి. మండలాన్ని యూనిట్ గా తీసుకొని బదిలీ చేస్తే బాగుంటుంది. 9 నెలల క్రితమే బదిలీ చేశారు. మళ్లీ ఇప్పుడు బదిలీ అనడం అన్యాయం.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్