Unified Building Rules: తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ నగరాల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, అర్బన్ డవలప్ మెంట్ ఆథారిటీలు, జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ(HMDA) లకు సంబంధించిన బిల్డింగ్ నిర్మాణ నియమావళి ఒకేలా ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ నగరాలు మొదలుకుని చిన్నచిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న అన్ని రకాల పరిస్థితులు, మాస్టర్ ప్లాన్లు, రోడ్ల విస్తరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఒకే విధమైన భవన నిర్మాణ నియమావళిని రూపొందించేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(HMDA) ను నోడల్ ఎజెన్సీగా ప్రభుత్వం నియమించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కన్సల్టెన్సీ కోసం హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించగా, ‘ఈ అండ్ వై’ అనే సంస్థ కన్సల్టెన్సీగా ఎంపికైనట్లు సమాచారం.
యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్
ఈ సంస్థకు ఇంతకుముందు మహారాష్ట్ర, గుజరాత్(Gujarath) రాష్ట్రాల్లో యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్(Unified Building Rules) రూపకల్పన చేసిన అనుభవం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు అనేక అంతర్జాతీయ నగరాల్లోనూ బిల్డింగ్ రూల్స్ రూపొందించిన సందర్భాలుండటంతో వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అనుకూలమైన యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ రూపకల్పన బాధ్యతలను హెచ్ఎండీఏ(HMDA) ఈ సంస్థకు అప్పగించినట్లు, ఇప్పటి వరకు చేసిన మాస్టర్ ప్లాన్ లు, ప్రస్తుతం అమల్లో ఉన్న బిల్డింగ్ రూల్స్ ఇన్ పుట్ ను కూడా సమర్పించినట్లు తెలిసింది. దీంతో ఈ అండ్ వై సంస్థ త్వరలోనే ప్రక్రియను మొదలు పెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: Mowgli Glimpse: పాతికేళ్లు కూడా నిండని కుర్రాడు ప్రేమ కోసం ఏం చేశాడంటే?
పది రోజుల్లో కీలక సమావేశం
యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ రూపకల్పనలో భాగంగా త్వరలోనే అన్ని ప్రభుత్వం సంస్థలు, ఇన్ఫ్రా కంపెనీలతో రానున్న పది రోజుల్లో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తుంది. ఈ సమావేశంలో అందరు అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు ‘ఈ అండ్ వై’ ప్రతినిధులు సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ అనుభవాలను వివరించనున్నారు. ఈ సమావేశానికి టీజీఐఐసీ(TGIIC), పంచాయతీరాజ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు, భవనాల శాఖ, విద్యుత్ శాఖ, రక్షణ శాఖ, రైల్వేశాఖ, ఏయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జలమండలి, మున్సిపల్ శాఖలోని డీటీసీపీ, సీడీఎంఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా వంటి శాఖలకు సంబంధించిన అధికారులు సైతం హాజరుకానున్నారు. వీరితోపాటు నిర్మాణ రంగంలోని నిపుణులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇంజినీరింగ్ అసోసియేషన్లు, రిటైర్డ్ ప్లానింగ్ ప్రొఫెసర్లు, వంటి వారి నుంచి వీలైనంత ఎక్కువగా సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ పై సంస్థలు, వివిధ విభాగాల అధికారులు, ప్లానింగ్ అధికారుల సందేహాలను కూడా ఈ అండ్ వై సంస్థ నివృత్తి చేయనున్నట్లు తెలిసింది.
Also Read: Railway Recruitment: రైల్వేలో జాబ్స్.. 2,418 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. వెంటనే, అప్లై చేయండి!