Ponnam Prabhakar: పర్యావరణ శాఖల కార్యదర్శిని కలిసిన పొన్నం!
Ponnam Prabhakar (image CREDit: swetcha Reporter)
Telangana News

Ponnam Prabhakar: కేంద్ర అటవీ పర్యావరణ శాఖల కార్యదర్శిని కలిసిన పొన్నం!

Ponnam Prabhakar: తెలంగాణలో గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఢిల్లీలో సెక్రెటరీ కోఆర్డినేషన్ డా.గౌరవ్ ఉప్పల్‌తో కలిసి  కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు.

Also Read: Ponnam Prabhakar: గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత నాది : మంత్రి పొన్నం ప్రభాకర్!

 రైతులకు సాగునీరు అందించే అవకాశాలు

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం మే 2025లో ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని దీనిపై న్యాయసలహా తీసుకొని అనుమతుల మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని వివరించానన్నారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విదేశాల్లో ఉన్న కారణంగా తన్మయికుమార్‌ను కలిసిప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చించినట్టు వివరించారు.

Also ReadPonnam Prabhakar: ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే పర్మిట్ రద్దు చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

Just In

01

BRS Strategy: హంగామా చేస్తున్న బీఆర్ఎస్.. గులాబీ అటెన్షన్ డైవర్షన్?

Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో

Coal Block Allegations: సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు?.. కేంద్ర మంత్రికి హరీష్ రావు కీలక లేఖ

Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Political News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి తప్పారు.. ఎంపీ రఘనందన్ రావు షాకింగ్ కామెంట్స్