Polavaram Project: ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా ఎత్తును పెంచుతుండడంతో తెలంగాణ (Telangana) తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నది. సీడబ్ల్యూసీకి (సెంట్రల్ వాటర్ బోర్డు కమిటీ) సైతం ప్రాజెక్టు ఎత్తు పెంచొద్దని లేఖలు సైతం రాసింది. అయినప్పటికీ ఏపీ నిర్మాణం చేపడుతుండడంతో ఇప్పటికే అభ్యంతరాలను తెలిపినా పెడచెవిన పెడుతున్నది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలతో 16 సమావేశాలు జరిగాయి. అయినప్పటికీ కొలిక్కి రాలేదు. ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలంగాణ గట్టిగా వాదనలు వినిపిస్తూ వస్తున్నది. ఇదే క్రమంలో మరోసారి పోలవరంపై అభ్యంతరాలు తెలిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్.. అథారిటీతో కలిసి చేయనున్న సీడబ్ల్యూసీ!
తెలంగాణ అభ్యంతరాలు
పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నది. ఆ ఎత్తుతో నిర్మించి పూర్తిస్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరుపగా ప్రాజెక్టును పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉన్నది. ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే తెలంగాణలోని 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి. దాంతోపాటు భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉంటుంది. కిన్నెరసాని, ముర్రేడు వాగుతో పాటు మరో ఆరు నుంచి ఏడు స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎక్కువ అవుతుందన్న ఆందోళన ఉన్నది. దుమ్మగూడెం ప్రాజెక్ట్ కింద 36 వాగులు వచ్చి చేరుతుండడంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలోనే ముంపునకు సంబంధించి కచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. దీనిపై ఇప్పటికే సీడబ్ల
వచ్చే నెల 7న పీపీఏ సమావేశం
నీటి వాటాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన సమావేశాలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదు. తెలంగాణలోని 6 మండలాల్లో డ్రైనేజీ రద్దీ అధ్యయనాలకు సంబంధించి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభ్యర్థన మేరకు హైడ్రోలాజికల్ స్టడీస్ ఆర్గనైజేషన్‌తో అవసరమైన అధ్యయనాన్ని చేపట్టనున్నారు. 6 మండలాల్లో నష్టం తదితర వివరాలను వర్షాకాలం తర్వాత అధ్యయనం చేయబోతున్నట్లు సమాచారం. మరోవైు, బనకచర్ల ప్రాజెక్టును నిర్మించవద్దని తెలంగాణ అభ్యంతరాలు తెలుపుతున్నది. అయినా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ రూపొంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నెల 10వ తేదీన సీడబ్ల్యూసీకి లేఖ సైతం రాసింది. నవంబర్ 7న హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా, గోదావరి భవన్‌లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఇరు రాష్ట్రాలకు సీడబ్య్లూసీ లేఖలు పంపింది. పోలవరం, బనకచర్ల అంశాలపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించేందుకు సిద్ధమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లను నిర్మించుకుండా, పోలవరం ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పీపీఏ సమావేశంలో ఏపీ తీరును ఎండగట్టాలని భావిస్తున్నది.
Also Read: Uttam Kumar Reddy: పోలవరం మార్పులను తిరస్కరించండి.. మంత్రి డిమాండ్!

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				