Phone Tapping Case( iamge credit: swetcha twitter)
తెలంగాణ

Phone Tapping Case: లీకైన టేపులపై.. దృష్టి సారించరా..?

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణ జరుపుతున్న సిట్ అధికారులు లీకైన టేపుల గురించి పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఈ దిశగా విచారణ ఎందుకు జరపడం లేదో తమకు కూడా అర్థం కావడం లేదని కొందరు పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. 2023లో బీఆర్ఎస్ (Brs) పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) రామచంద్ర భారతి, (Ramachandra Bharathi) నందకుమార్, సింహయాజీ స్వామిలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

బీజేపీ పార్టీ తరపున ఈ ముగ్గురు బేరసారాలు జరిపారని అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పెద్దలు ఆరోపణలు చేశారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మీడియా సమావేశంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో నందకుమార్ మాట్లాడిన ఆడియో టేపును వినిపించారు. దాంతో పాటు నందకుమార్ (Nandakumar) సింహయాజీ స్వామితో మాట్లాడిన ఆడియో టేపును కూడా అందరికీ వినిపించారు. అప్పట్లో ఇది తీవ్ర కలకలం సృష్టించింది.

 Also Read: Maoists Killed in Encounter: ఛత్తీస్గఢ్ అడవుల్లో.. మరో ఎన్కౌంటర్!

విచారణలో అనుమానాలు..
నందకుమార్ (Nandakumar) సంభాషణల ఆడియో టేపులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)  చేతికి ఎలా అందాయి అన్న ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. దీనికి రోహిత్ రెడ్డి,(Rohit Reddy) తనతో నందకుమార్ ఫోన్‌లో మాట్లాడినప్పుడు తాను రికార్డ్ చేశానని సమాధానం ఇచ్చారు. ఇది నిజమే అని అనుకున్నా, సింహయాజీ స్వామితో మాట్లాడిన మాటలు ఎలా రికార్డ్ అయ్యాయి? ఎవరు రికార్డ్ చేశారు? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు దొరకలేదు. ఫోన్లను ట్యాప్ చేయడానికి ఎస్‌ఐబీ (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో)లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ సభ్యులే నందకుమార్ (Nandakumar) ఫోన్‌ను ట్యాప్ చేసి రికార్డు చేసినట్టుగా అనుమానాలున్నాయి.

అయితే, ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు,(Prabhakar Rao) ప్రణీత్ రావులను పలుమార్లు విచారించినా, లీకైన ఈ ఆడియో టేపుల గురించి ప్రశ్నించలేదని సమాచారం. మీడియా సమావేశం పెట్టి మరీ ఈ ఆడియో టేపులను వినిపించిన కేసీఆర్‌ను ప్రశ్నించడానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ట్యాపింగ్ బాధితుడైన నందకుమార్ నుంచి వాంగ్మూలం కూడా తీసుకోలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి కాస్త లోతుగా విచారణ చేస్తే ట్యాపింగ్ కేసులో సూత్రధారులు ఎవరన్నది బయట పడుతుందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

 Also Read: Hyderabad ORR Kondapur : ఔటర్ నుంచి కొండాపూర్ వైపు.. ఇక అడ్డంకుల్లేని ప్రయాణం!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు