Minister Sridhar Babu: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు (Minister Sridhar Babu) అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ‘ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్-2025’లో కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్ బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం దక్కింది. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు.
Also Read: Minister Sridhar Babu: వరంగల్ నల్గొండ జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్.. టీ హబ్ తరహాలో ఏర్పాటు!
గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌టెక్
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో “గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌టెక్” ఆవిష్కరణ హబ్ గా తెలంగాణ ను తీర్చి దిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. “ఆస్ట్రేలియా – తెలంగాణ” మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని, మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
Also Read: Minister Sridhar Babu: రెండు మూడు నెలల్లో ‘ఏఐ’ సిటీకి భూమి పూజ: మంత్రి శ్రీధర్ బాబు
జూబ్లీహిల్స్ గెలుపును ఆపలేరు.. మంత్రి శ్రీధర్ బాబు
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ…బీఆర్ ఎస్ ఓడిపోతుందని ముందే గ్రహించిందని, అందుకే డ్రామాలు ఆడుతుందన్నారు. బీఆర్ ఎస్ ను ఇక నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఆయా నాయకులు భ్రమల్లో బతుకుతున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ చోరీ చేస్తున్నాయన్నారు. కర్ణాటక లో జరిగిన ఓట్ చోరి పై రాహుల్ గాంధీ ఆధారాలు చూపారన్నారు.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కేటీఆర్ తీరు ఉన్నదన్నారు. అసెంబ్లీ ఎన్నికల కు ముందు అధికారంలో బీఆర్ ఎస్ ఉన్నదని, ఓటర్ లిస్ట్ లో తప్పిదాలు జరిగింది కూడా బీఆర్ ఎస్ లోనే అని వివరించారు. తమ పార్టీ అభ్యర్ధి బస్తీ వాసులకు అందుబాటులో ఉంటారని, ఎవరూ తమ విజయాన్ని ఆపలేరని వెల్లడించారు. తప్పుడు కారణాలను సోషల్ మీడియాలో తిప్పుతూ బీఆర్ఎస్ భ్రమల్లో ఉన్నదని మండిపడ్డారు. ఇక అంతకంటే ముందు గాంధీభవన్ లో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత డాక్టర్ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ చెకప్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
Also Read: Minister Sridhar Babu: రెండు మూడు నెలల్లో ‘ఏఐ’ సిటీకి భూమి పూజ: మంత్రి శ్రీధర్ బాబు
