KCRANDKTR
తెలంగాణ

Kcr Birthday : నా తండ్రి తెలంగాణకే హీరో… కేటీఆర్​ ఎమోషనల్​ ట్వీట్​

Kcr Birthday : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమారుడు, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పిల్లలేవరికైనా  వారి తండ్రే హీరో అవుతాడు. కానీ నా తండ్రి నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణకే హీరో కావడం నాకు దక్కిన అదృష్టం. ప్రత్యేక రాష్ట్రం అనే కలను కనడమే కాదు దాన్ని సాకారం చేసి చూపించిన నాయకుడు కేసీఆర్​. దాని కోసం వ్యక్తిగత జీవితాన్ని సైతం పణంగా పెట్టారు.”అని ‘ఎక్స్​’ వేదికగా పోస్టు చేశారు. ఈ సందర్బంగా… తన తండ్రి సాధించిన దానిలో అణువంతైన సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కేసీఆర్​ కొడుకు అని గర్వంగా చెప్పుకునేందుకు, ఆయన వారసత్వానికి అర్హుడిగా ఉండేందుకు ప్రతి క్షణం కృషి చేస్తా’ అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, నేటితో 7‌‌0 వసంతాలు పూర్తి చేసుకున్న కేసీఆర్​… 71వ పడిలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి సైతం విషెస్​ తెలిపారు. కేసీఆర్​ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ‘ఎక్స్​’లో పోస్టు చేశారు. ఇక, తమ నాయకుడి పుట్టినరోజును బీఆర్​ఎస్​ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్​ ఫామ్​హౌస్​కే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు కూడా హజరుకావడం లేదు.  అయితే ఇటీవల ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పలువురు కార్యకర్తలతో ముచ్చటించిన ఆయన… తాను కొడితే మాములుగా ఉండదని, భూకంపం పుట్టిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే కేసీఆర్​ బయటకు వస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ ఆయన బయటికి రాలేదు. కానీ మరో రెండు రోజుల్లో 19వ తేదిన మాత్రం పార్టీకి సంబంధించి కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. బీఆర్​ఎస్​(అంతకు ముందు టీఆర్​ఎస్​) ఆవిర్భవించి ఎల్లుండికి 24 సంవత్సరాలు పూర్తవుతున్నందున సందర్భంగా ‘సిల్వర్​ జూబ్లీ’ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ వెంటనే జరిగిన లోక్​సభ ఎన్నికల్లో పార్టీ కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సమరాన్ని బీఆర్​ఎస్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాబట్టి 19న జరిగే మీటింగ్​ అత్యంత కీలకం కానుంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు