SC Classification GO: ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కలను నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జీవో (SC Classification GO)ను విడుదల చేసింది. నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ మేరకు ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రజలకు జీవో ద్వారా కానుకను అందించింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ జీవోకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను ఇంగ్లీషుతో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లో రిలీజ్ చేయడం విశేషం.
Also Read: Bhu Bharati Portal: బాబోయ్.. భూ భారతి పోర్టల్ ను ఇంత బాగా డిజైన్ చేశారా? ఆ సమస్యలు తీరినట్లే!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ వర్గంలో దాదాపు 59 ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఆ ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా ఉన్న వెనుకబాటు ఆధారంగా వారిని గ్రూప్ – A గ్రూప్ – B, గ్రూప్ – C కింద డివైడ్ చేశారు. గ్రూప్ – Aకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించగా.. గ్రూప్ – Bకి 9 శాతం, గ్రూప్ – Cకి 5 శాతం రిజర్వేషన్లు అందించారు. తాజా జీవో నేపథ్యంలో నేటి నుంచే ఈ రిజర్వేషన్ల విధానం అమల్లోకి రానుంది.