Cancer Centers (imagecredit:swetcha)
తెలంగాణ

Cancer Centers: క్యాన్సర్ నియంత్రణపై సర్కార్ ఫుల్ ఫోకస్.. 33 జిల్లాల్లో..?

Cancer Centers: క్యాన్సర్ డే కేర్ సెంటర్లు రెడీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ లో 20 బెడ్లను ఏర్పాటు చేయగా, ఇందులో 10 క్యాన్సర్ , పది పాలియేటివ్ కేర్ సేవల కోసం వినియోగించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లో అత్యాధునికంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ఈ కేంద్రాల్లోనే కీమో థెరపీ(Chemotherapy) నిర్వహించేందుకు అవసరమైన ఎక్విప్ మెంట్లు, ఇతర వైద్య సదుపాయాలను కూ‌‌డా కల్పించారు. పేషెంట్ ఒక్క రోజులోనే ఇంటికి వెళ్లేలా ట్రీట్మెంట్ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీంతో ఖర్చు తగ్గడమే కాకుండా, పెద్ద ఆసుపత్రులపై భారం కూడా తగ్గనుంది. క్యాన్సర్(Cancer) నియంత్రణలో భాగంగా ఈ కేంద్రాలను అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఈ నెల 8 లేదా 9 తేదీల్లో ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుప(MNJ Cancer Hospital)త్రి నుంచి వర్చువల్ మోడ్ లో వైద్యారోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా ఈ సెంటర్లను లాంచ్ చేయనున్నారు.

సెంటర్ ఆఫ్​ ఎక్స్ లెన్స్ గా ఎంఎన్ జే..?

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 33 డే కేర్ సెంటర్లకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సెంటర్ ఆఫ్​ ఎక్స్ లెన్స్(MNJ Cancer Hospital Center of Excellence) గా పనిచేయనున్నది. జిల్లా డే కేర్ సెంటర్లలోని సివియర్ పేషెంట్లకు, కాంప్లికేటెడ్ ఆరోగ్య సమస్యలకు ఎంఎన్ జే నుంచి సలహాలు, సూచనలతో పాటు మెడికేషన్ రిఫర్ చేసేందుకు స్పెషలిస్టులు పనిచేయనున్నారు. అంతేగాక అవసరమైన పేషెంట్లకు కీమోథెరఫీ షెడ్యూల్ చేసి, ఫస్ట్ డోస్ సెషన్ ను ఎంన్ జేలోనే పూర్తి చేస్తారు. ఆ తర్వాత జిల్లా డే కే సెంటర్లలో అవకాశం కల్పిస్తారు. మందులు కూడా పంపిణీ చేయనున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఈ చికిత్సలను నిర్వహించి ఆయా కేంద్రాలన్నీ సక్సెస్ పుల్ గా రన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నది.

Also Read: CM Revanth Reddy: వ‌ర్షాలు, వ‌ర‌ద‌ న‌ష్టాల‌పై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక అదేశాలు!

3 రోజులు ట్రైనింగ్..

క్యాన్సర్ డే కేర్ సెంటర్లలో పనిచేసే స్టాఫ్​ కు నోడల్ సెంటర్ ఎంన్ జేలో మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అంకాలజిస్టులు, సర్జరీ, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందికి సీనియర్లచే ట్రైనింగ్ ఏర్పాటు చేయనున్నారు. స్టాండర్డ్స్ ప్రోటోకాల్ ప్రోసీజర్స్, ట్రీట్మెంట్ విధానాలపై అవగాహన కల్పించనున్నారు. పేషెంట్లకు వేగంగా వైద్యం అందించేందుకు చేయాల్సిన విధానాలపై అవగాహన కల్పించనున్నారు.

ఏ చికిత్సలు నిర్వహిస్తారంటే..?

డేకేర్ సెంటర్లలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నపేషెంట్లకు, శ్వాసకోశ సమస్యలను అధిగమించడం కోసం పాలియేటివ్ కేర్ లో ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. దీని వలనమానసిక, ఆర్ధిక భారం తగ్గించడం సాధ్యం కానున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పల్లియేటివ్‌ కేర్‌ అవసరమైన వారిలో కేవలం 14 శాతం మందికే ఈ సేవలు అందుతున్నాయి. ఇప్పుడు పేషెంట్లకు ఎలాంటి చిక్కులు లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యం పెట్టుకున్నది. ప్రధానంగా క్యాన్సర్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, డిమెన్షియా, పార్కిన్సన్స్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌, స్ట్రోక్‌, హృదయ, ఊపిరితిత్తుల, కాలేయ, కిడ్నీ సమస్యలు, వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కలిగిన వారికి ఈ కేంద్రాల్లో ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు.

Also Read: CM Revanth Reddy: పాలమూరు జిల్లాలో విద్య వైద్యం సాగు నీటి ప్రాజెక్టులు పూర్తికి ప్రాధాన్యం.. సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!