Adluri Laxman Kumar: బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పేర్కొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తమకు ప్రభుత్వం 25 శాతం నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మంత్రి ని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. గత ప్రభుత్వంలో రాష్టాన్ని అప్పులు పాలు చేసినందువల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ, విద్యకు ప్రాధాన్యత తగ్గకుండా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యా బోధన చేసే వారి పరిస్థితి తనకు తెలుసునని, డిప్యూటీ సీఎం హామీ మేరకు ఇప్పటికే 25 శాతం నిధులు విడుదల చేశామన్నారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ దశలవారీగా పరిష్కార చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Also Read: Adluri Laxman Kumar: మైనార్టీ ఉద్యోగుల జీతాల్లో టెక్నికల్ ఎర్రర్.. త్వరలో జీఓ జారీ!
డైట్ చార్జీలను గ్రీన్ చానెల్ ద్వారా విడుదల చేసే నిర్ణయం
టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి సంబంధించిన డైట్ చార్జీలను గ్రీన్ చానెల్ ద్వారా విడుదల చేసే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. డే స్కాలర్ల కంటే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని ఎవరూ ఇబ్బందులు పడకూడదని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ఉన్న నిబద్ధత, ముందుచూపు, ఆలోచనతో రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కే. వీరన్న, ప్రధాన కార్యదర్శి శేఖర్‌రావు, ట్రెజరర్ లింగారెడ్డి, చీఫ్ అడ్వైజర్ రాయిరెడ్డి, సభ్యులు చరణ్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యలో పెట్టుబడి… భవిష్యత్తుకు బలమైన పునాది
విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను సాకారం చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఎస్.ఆర్. శంకరన్ జయంతి సందర్భంగా గౌలీదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో విద్యార్థులతో మమేకమై, విద్యా ప్రాముఖ్యతపై స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెనపూడి గాంధీ , ప్రిన్సిపాల్ అంజన్న , కల్పన లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… సామాజిక న్యాయానికి ప్రతీక ఎస్.ఆర్. శంకరన్ అని కొనియాడారు. దేశంలోని అత్యున్నత సేవా తపన కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు వర్గాల జీవితాలలో వెలుగు నింపేందుకు అహర్నిశలు శ్రమించారన్నారు. ఆయన చూపిన మార్గం లోనే ప్రస్తుతం రాష్ట్ర సంక్షేమ విధానాలకు సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారని వివరించారు.
Also Read: Adluri Laxman Kumar: గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్‌లు పెంచేందుకు ప్రభుత్వం సిద్దం
