Alcohol Rates | తెలంగాణలో మద్యం ప్రియులకు వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్ననే బీర్ల ధరలు 15 శాతం పెంచారు. సరేలే మందు బాటిళ్ల ధరలు పెంచలేదు కదా అని వాళ్లు సంతోషపడేలోపే మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. త్వరలోనే అన్ని రకాల మందు బాటిళ్లపై కూడా ధరలు పెంచబోతున్నారు. చీప్ లిక్కర్, విస్కీ, రమ్, వైన్, జిన్, ప్రీమియం, విదేశీ మందు బాటిళ్ల మీద కూడా 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెంచబోతున్నారని తెలుస్తోంది.
చీప్ లిక్కర్ మందు బాటిళ్ల దర ఇప్పటి వరకు రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. రాయల్ స్టాగ్, రాయల్ ఛాలెంజ్ లాంటి మద్యం బాటిళ్ల ధర రూ.210 వరకు ఉంది. ప్రీమియం మద్యం బాటిళ్ల ధరలు రూ.300లకు పైగానే ఉన్నాయి. వీటి అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటిపై ధరలు పెంచితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అఇతే బీర్లు, మద్యం ధరల పెరుగుదలతో కొనుగోలు దార్లు వెనకడుగు వేసే అకవాశం కూడా ఉంది.