Ration Card
తెలంగాణ

New Ration Cards | తెలంగాణలో కోటి రేషన్ కార్డులు.. వచ్చే నెలలోనే పంపిణీ..!

New Ration Cards | తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకుంటుంది. ఇప్పటికే చాలా సార్లు పెండింగ్ పడ్డ రేషన్ కార్డుల పంపిణీకి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు పడుతోంది. దీంతో అసలు రేషన్ కార్డులు ఇస్తారా లేదా అన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఎమ్మెల్సీ (mlc) కోడ్ ఉన్న జిల్లాలను వదిలిపెట్టి మిగతా అన్ని జిల్లాల్లో రేషన్ కార్డులు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

కొత్త రేషన్ కార్డులతో పాటు.. పాత వాటిల్లో మార్పులు, చేర్పులు చేసుకునే వాటిని కూడా కొత్తగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా పాతవి, కొత్తవి కలిపి మొత్తం వచ్చే నెలలో కోటి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ రేషన్ కార్డులు డిటిజలైజ్ రూపంలో ఉండబోతున్నాయి. కార్డు మీద క్యూ ఆర్ కోడ్ లేదా బార్ కోడ్ లాంటిది ఉంటుంది. పాత్ రేషన్ కార్డు కంటే కొంచెం తక్కువ సైజ్ లో ఉండబోతోంది. ఆ క్యూ ఆర్ కోడ్ లో అన్ని వివరాలు ఉండబోతున్నాయంట. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కోడ్ ముగిసిన తర్వాత ఇవ్వనున్నారు.

గత పదేళ్లుగా తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఇవ్వబోతున్న రేషన్ కార్డుల విషయంలో ఉన్న గందరగోళంకు రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. అప్లై చేసుకున్న అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పైగా దీనికి ఒకసారి అవకాశం ఇవ్వకుండా.. నిరంతరాయంగా అప్లై చేసుకునేలా ఆదేశాలు ఇచ్చారు. గత నెల 26 నుంచే రేషన్ కార్డుల అప్లికేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యలో వచ్చిన టెక్నికల్ ఆటంకాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు.

కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం వల్ల ప్రభుత్వంపై భారం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి వాటన్నింటికీ ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?