Telangana Tourism (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Tourism: ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రభుత్వ ముఖ్య ప్రణాళికలు ఇవే..!

Telangana Tourism: ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం ప్రాంతాల్లో కాటేజీల నిర్మాణంపై దృష్టిసారించింది. మరోవైపు ఏకోటూరిజంను బలోపేతానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు టూరిజంకు ఆదాయాన్ని సమకూర్చేందుకు సిద్ధమైంది. ఒక్కో కాటేజీని సుమారు రూ.20లక్షలతో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలు, జల పాతాలు, జీవ వైవిధ్య ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే ప్రదేశాలను టూరిజంశాఖ గుర్తించింది. తొలుత అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు పర్యాటక ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధిచేయాలని భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించారు.

70 కంటే ఎక్కువ జాతులు..

మంజీరా అభయారణ్యం సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఉంది. మంజీరా డ్యామ్ ఉండగా.. పుల్కల్ మండలంలో సింగూర్ డ్యామ్ ఉంది. ఈ రెండింటి మధ్య దూరం 20 కి. మీ. గా ఉంది. ఈ ప్రదేశం మొత్తం మంజీరా నది విస్తరించి ఉంది. సంగారెడ్డి సింగూరు డ్యామ్‌ల మధ్య ఈ వైల్డ్ లైఫ్ శాంక్చరీ విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం మొసళ్లకు ప్రత్యేకతగా నిలుస్తోంది. వాటికి రక్షణ కల్పించడమే కాక సుమారు 70 కంటే ఎక్కువ జాతుల పక్షులకు అలాగే అంతరించిపోతున్న మగ్గర్ మొసళ్లకు నిలయంగా ఉంది. మంజీరా అభయారణ్యంలో 303 రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దాదాపు 117 రకాల కంటే ఎక్కువగానే వలస పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. 14 జాతుల ఉభయ చరాలు ఇక్కడ సంచరిస్తున్నారు. 57 రకాల జాతుల చేపలు మంజీరా నదిలో జీవిస్తున్నాయి.

మంజీరా అభయారణ్యం వద్ద

నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 32 రకాల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తున్నాయి. నదీ పొడవునా విస్తరించి ఉన్న అభయారణ్యంలో 9 ద్వీపాలు ఉన్నాయి. ఏడాది పాటు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉండటంతో ఈ ప్రదేశం ప్రకృతి రమణీయతను చాటుతుంది. ఇక్కడ సుమారు 4 వందల వరకు మొసళ్లు ఉంటాయి. ఈ ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంజీరా అభయారణ్యం వద్ద కాటేజీలు నిర్మిస్తున్నారు. అలాగే 13 ఎకరాల్లో బోటింగ్ ప్లాజా నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి మొసళ్లను వీక్షించేందుకు అనుగుణంగా వాచ్ టవర్ నిర్మించనున్నారు. గైడ్ టూర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ అభయారణ్యం హైదరాబాద్‌ కు అతి దగ్గరలోనే ఉండటంతో ఈ అందాలను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. పర్యటకుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

Also Read: Digital Payments: భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం

అనంతగిరి తెలంగాణ ఊటిగా పేరుంది. చుట్టు కొండలు, అహ్లాదకరమైన వాతావరణం, పర్యటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ మరింత అభివృద్ధి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే 8 కాటేజీల నిర్మాణంను చేపట్టబోతున్నారు. ఒక్కోదానికి రూ.20లక్షలతో నిర్మించబోతున్నారు. అదే విధంగా మన్ననూరులో సైతం 14 కాటేజీలు నిర్మించబోతున్నారు. అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో వసతులను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఎకో కాటేజీల నిర్మాణం, ట్రెక్కింగ్ పార్క్, సఫారీ ట్రాక్, వాచ్ టవర్ ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఎకో టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. ట్రెక్కింగ్ పార్క్​, సఫరీ ట్రాక్​, ప్రకృతి అందాలను ఒకచోటి నుంచి వీక్షించేలా వాచ్​ టవర్లు నిర్మించనున్నారు. నిజామాబాద్​ జిల్లా నందిపేటలోని ఉమ్మెడ, గాజపల్లి, బిలస్పూర్ సైట్లలో ఎకో టూరిజం పనులు ప్రారంభం కానున్నాయి.

స్థానిక ప్రజలకు ఉపాధి..

పర్యాటకుల కోసం సరికొత్త అనుభూతులను అందించేందుకు ట్రెక్కింగ్ పార్కులు, సఫారీ ట్రాక్‌లు, వాచ్ టవర్లు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఇవి సందర్శకులకు ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు వన్యప్రాణులను దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కల్పించనున్నాయి. ఎకో టూరిజం(Ecotourism) ప్రాజెక్టులో భాగంగా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన్ననూరులో ఇప్పటికే 130 మంది గైడ్‌లకు ఎకో టూరిజం హాస్పిటాలిటీపై శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వరంగల్ జూ పార్కును వర్చువల్ రియాలిటీ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త సాంకేతిక అనుభవాలను అందించనున్నారు.

Also Read: Damodar Rajanarasimha: మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?