Telangana Eco Tourism: పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఎకో టూరిజంపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలు, జల పాతాలు(Water bodies), జీవ వైవిధ్య ప్రదేశాలు(biodiversity hotspots), సంస్కృతి(culture), సంప్రదాయాలు(traditions), ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే ప్రదేశాలను టూరిజంశాఖ గుర్తించింది. పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు టూరిజం శాఖకు ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు గాను, రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో ఎకో కాటేజీల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో కాటేజీని సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) చేపట్టనున్నారు.
64 స్పాట్లు గుర్తింపు..
తొలుత అనంతగిరి(Ananthagiri), కనకగిరి(Kanakagiri), నందిపేట(Nandipet), మన్ననూరు(Mannanur) పర్యాటక ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించారు. వికారాబాద్‌లోని అనంతగిరికి తెలంగాణ ఊటిగా పేరుంది. చుట్టు కొండలు, అహ్లాదకరమైన వాతావరణం, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ మరింత అభివృద్ధి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకే అనంతగిరిలో 8 కాటేజీలు, మన్ననూరులో 14 కాటేజీల నిర్మాణం చేపట్టబోతున్నారు. అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఎకో కాటేజీల నిర్మాణంతో పాటు ట్రెక్కింగ్ పార్క్, సఫారీ ట్రాక్, ప్రకృతి అందాలను ఒకచోటి నుంచి వీక్షించేలా వాచ్ టవర్ ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని ఉమ్మెడ, గాజపల్లి, బిలస్పూర్ సైట్లలో ఎకో టూరిజం పనులు ప్రారంభం కానున్నాయి. ఇవి సందర్శకులకు ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు వన్యప్రాణులను దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కల్పించనున్నాయి.
Also Read: Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు.. ఎందుకంటే?
మంజీరా అభయారణ్యంలో..
సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చరీ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. సంగారెడ్డి, సింగూరు డ్యామ్‌ల మధ్య విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం అంతరించిపోతున్న మగ్గర్ మొసళ్లకు రక్షణ కల్పిస్తోంది. నదీ పొడవునా విస్తరించి ఉన్న అభయారణ్యంలో 9 ద్వీపాలు ఉన్నాయి. ఏడాది పాటు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉండటంతో ఈ ప్రదేశం ప్రకృతి రమణీయతను చాటుతుంది. ఇక్కడ సుమారు 400 వరకు మొసళ్లు ఉన్నట్లు అంచనా. ఈ ప్రాంతంలో దాదాపు 303 రకాల పక్షులు, 117కు పైగా వలస పక్షులు, 14 జాతుల ఉభయచరాలు, 57 జాతుల చేపలు, 32 రకాల సీతాకోక చిలుకలు జీవ వైవిధ్యాన్ని చాటుతున్నాయి. ఈ అభయారణ్యం వద్ద కాటేజీలు, 13 ఎకరాల్లో బోటింగ్ ప్లాజా, మొసళ్లను వీక్షించేందుకు వాచ్ టవర్ నిర్మించనున్నారు. గైడ్ టూర్లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అభయారణ్యం హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఉండటం పర్యాటకులను మరింత ఆకర్షించనుంది.
ఉపాధి, సాంకేతికతపై దృష్టి
ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన్ననూరులో ఇప్పటికే 130 మంది గైడ్‌లకు ఎకో టూరిజం హాస్పిటాలిటీపై శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వరంగల్ జూ పార్కును పర్యాటకులకు సరికొత్త సాంకేతిక అనుభవాన్ని అందించేందుకు వర్చువల్ రియాలిటీ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే విధంగా వరంగల్ జూ పార్కును వర్చువల్ రియాలిటీ పార్కుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త సాంకేతిక అనుభవాలను అందించనున్నారు.
Also Read: Telangana Tourism: తెలంగాణ పర్యాటక రంగం కొత్త వ్యూహం.. బుద్ధవనానికి ఇంటర్నేషనల్ లుక్
