MPDO
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana: 144 పోస్టుల ఖాళీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

Telangana: రాష్ట్రంలో ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టింది. మల్టీజోన్-1లోని15 జిల్లాల్లోనే 42 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా144 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మరోవైపు కొత్తగా ఏర్పడిన 32 మండలాలకు సైతం ఎంపీడీవోలు లేరు. అయితే, ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ఎంపీవోలు, సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించాలని పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వం దృష్టి పెట్టినా భర్తీలో ఆలస్యం

రాష్ట్రంలో మండల పరిషత్​ అభివృద్ధి అధికారులు(ఎంపీడీవో)లు కొరత ఉంది. ప్రభుత్వం పరిపాలనపై దృష్టిసారించినప్పటికీ భర్తీలో కొంత ఆలస్యం అవుతున్నది. మరోవైపు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా రాష్ట్రంలో 32 మండలాలను ఏర్పాటు చేసింది. అయితే, మండలాధికారుల నియామకం చేపట్టకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతున్నదని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు సైతం గతంలో ప్రస్తావించారు. అయినప్పటికీ భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను రెండు విడుతలుగా నిర్వహించాలని భావిస్తున్నది. అయితే, రాష్ట్రంలో ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు వస్తాయని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఇతర అధికారులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని అధికారులను ఆదేశించింది. ఖాళీ ఉన్న చోట తాత్కాలికంగా కింది స్థాయి అధికారులు మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు), సూపరింటెండెంట్లను ఎంపీడీవోలుగా ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక ఎంపీడీవోకు రెండు, మూడు మండలాల బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొన్నదని సమాచారం. ఫలితంగా అధికారులపై పని భారం పడుతుందని, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Read Also- Fertility Centers: తనిఖీలు లేవ్.. రెయిడ్స్ లేవ్.. చెలరేగిపోతున్న ఫర్టిలిటీ సెంటర్లు

ఖాళీల్లో సర్దుబాటుకు పంచాయతీరాజ్​ శాఖ సన్నాహాలు

రాష్ట్ర వ్యాప్తంగా 144 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవో పోస్టులు ఖాళీల్లో సర్దుబాటు​ చేయడానికి పంచాయతీరాజ్​ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి ఎంపీవోలను, సూపరింటెండెంట్లను నియమించేలా కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త ఎంపీడీవోల నియామక జరగనున్నది. ఈ మండలాలకు కొత్త ఎంపీడీవోలు వచ్చే వరకు ఇన్‌ఛార్జ్ అధికారులతో పనులు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మల్టీజోన్-1లోని 15 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం ఆసీఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలోనే 42 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది. ఎంపీడీవోలు మండల స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమన్వయం చేయడంలో కీలక భూమిక పోషిస్తారు. వీరి కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల నిర్మాణం వంటి పనులను పర్యవేక్షించలేని పరిస్థితి నెలకొన్నది. ఉపాధి హామీ పథకం కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Read Also- Sathi Leelavathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి భర్తతో గొడవ.. టీజర్ చూశారా?

Just In

01

Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!

Gold Rate Today: వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్?

FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?